లక్ష మందికి ఉపాధి కల్పించిన స్టార్ హీరో - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష మందికి ఉపాధి కల్పించిన స్టార్ హీరో

March 24, 2022

vvvv

ప్రస్తుత కాలంలో యువతను వేధిస్తున్న ప్రధానమైన సమస్య నిరుద్యోగం. దేశ వ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగిత రోజు రోజుకూ పెరిగిపోతోంది. కరోనా తర్వాత దాని స్థాయి మరింత పెరిగింది. దీంతో యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు కూడా పెద్ద సమస్యగా మారింది. కానీ, ఈ విషయంలో స్టార్ హీరో, నటుడు విజయ్ సేతుపతి చాలా పెద్ద స్టెప్ తీసుకున్నారు. గత మూడేళ్లుగా తమిళనాడులో లక్ష మంది యువత ఉద్యోగాలు పొందేందుకు సహాయపడ్డాడు. ఇందుకు ఒక ఎన్జీవో సహాయం తీసుకున్నాడు. వీర రాఘవన్ అనే వ్యక్తి నడుపుతున్న ఈ ఎన్జీవో యువతకు ఉపాధి పొందడంలో సహాయపడుతుంది. ఈ విషయం తెలిసిన విజయ్, తాను హోస్ట్‌గా చేసిన ఓ షోకు అతడిని ఆహ్వానించి వివరాలు తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఆర్ధిక సహాయం అందిస్తానని మాటిచ్చి, మూడేళ్లుగా ఆ ఎన్జీవోకు క్రమం తప్పకుండా డబ్బులు పంపిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని వీర రాఘవన్ బయటి ప్రపంచానికి తెలియజేయడంతో పలువురు విజయ్ సేతుపతిని  అభినందిస్తున్నారు.