స్టార్ సినిమాతో టాయిలెట్ వార్ చేసి నిలబడుతుందా ? - MicTv.in - Telugu News
mictv telugu

స్టార్ సినిమాతో టాయిలెట్ వార్ చేసి నిలబడుతుందా ?

August 1, 2017

‘ రబ్ నే బనాదీ జోడీ ’ సినిమాతో మస్త్ జోడీ అనిపించుకున్న షారూఖ్ ఖాన్, అనుష్క శర్మలది క్రేజీ కాంభినేషనైంది. ఆ సినిమా తర్వాత జబ్ తక్ హై జాన్ సినిమాలో కలిసి నటించారు. తాజాగా ఈ హిట్ పెయిర్ మరొకసారి బాలీవుడ్ ప్రేక్షకులను అనువిందు చేయనున్నారు. ‘ జబ్ హర్రీ మెట్ సెజాల్ ’ సినిమాతో మళ్లీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే జబ్ వె మెట్, లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే, తమాషా వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలను రూపొందించిన ఇంతియాజ్ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే. ఫిబ్రవరి 4 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే అక్షయ్ కుమార్ నటించిన ‘ టాయిలెట్ ’ సినిమా కూడా ఆగస్టు 11 న రిలీజ్ అవనుంది. టాయిలెట్ మీద కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే వున్నాయి.

శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమీ ఫడ్నేకర్, సనాఖాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వారం వ్యవధిలో విడుదలౌతున్న ఈ రెండు సినిమాల మీద ఆడియన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. చూడాలి మరి రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులను అలరిస్తుందో !? సూపర్ స్టార్ హీరో అయిన షారూఖ్ ఖాన్ సినిమా హిట్టౌతుందా ? షారూఖ్ ఖాన్ కన్నా తక్కువ స్టార్ డమ్ వున్న అక్షయ్ కుమార్ సినిమా హిట్టౌతుందా అనేదిప్పుడు హాట్ టాపిక్ ! టాయిలెట్ ఒక సామాజిక సమస్యతో రూపుదిద్దుకుంటోంది, జబ్ హర్రీ మెట్ సెజాల్ ఇండియన్ రొమాంటిక్ సినిమాగా రూపొందింది. షారూఖ్ ఖాన్ అంతటి ఒక స్టార్ సినిమాతో అక్షయ్ కుమార్ టాయిలెట్ వార్ చేసి నిలబడుతుందా అంటే వెయిట్ అండ్ సీ !!