ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 13న జరగనున్న ఆస్కార్ వేడుకలో అవార్డులను ప్రకటించనున్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించకున్న నాటునాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సాధించుకుంటుందని తెలుగుతో పాటు భారత్ చిత్ర పరిశ్రమ ఆశగా ఎదురుచూస్తోంది. ఇదే విషయంపై నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ పాటకు ఖచ్చితంగా అస్కార్ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఆ విజయాన్ని ప్రజలందరూ పండగగా జరుపుకోవాలని చెప్పారు. అస్కార్ అవార్డును రాజమౌళి సినిమాకు వచ్చిన గుర్తింపుగా కాకుండా తెలుగు, భారతీయ సినిమాకు వచ్చిన గౌరవంగా భావించాలని పేర్కొన్నారు. భారతదేశం నుంచి ఓ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరినందుకు మనమంతా గర్వపడాలి అని వ్యాఖ్యానించారు.అస్కార్ నామినేషన్ లో చోటుదక్కడం చిన్న విషయం కాదన్నారు అల్లు అరవింద్.