టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ భార్య ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గతరాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చిన్నారులతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు.”మా ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ కొత్తగా వచ్చి చేరారు. వారు మాతోనే ఉండిపోయే అతిథులు” అంటూ క్యాపన్ష్ పెట్టారు.
నటుడు రాహుల్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిన్నారుల ఫోటోలను వీక్షిస్తున్న సెలబ్రిటీలు, నెటిజన్లు దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కవలల్లో బాబు, పాప ఉన్నారు. కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న చిన్మయి-రాహుల్ పెద్దల అంగీకారంతో 2014లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక, సింగర్ చిన్మయి శ్రీపాద విషయానికొస్తే.. సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేశారు. తెలుగులో బాయ్స్, శివాజీ, ఆరెంజ్, ఏమాయ చేశావే, ఊసరవెల్లి, రంగం, ఎందుకంటే ప్రేమంట, గోవిందుడు అందరివాడేలే నుంచి ఇటీవల విడుదలైన మేజర్ వరకు ఎన్నో సినిమాల్లో ఆమె పాటలు పాడారు.
ఆమె భర్త రాహుల్ రవీంద్రన్.. హీరోగా, సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు చేశారు. శ్యామ్‌సింగరాయ్ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘చి..ల..సౌ’సినిమాతో దర్శకుడిగా పరిచయ్యాడు. చిన్మయి-రాహుల్ ఒకే పరిశ్రమలో వేర్వేరు విభాగాలకు చెందినవారు అయినప్పటికి మొదటగా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. కొంతకాలానికే ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో 2014లో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం చిన్మయి కవలలకు జన్మనివ్వడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.