Star Sports to re-telecast the India-Pakistan match
mictv telugu

దీపావళి కానుక.. నిన్నటి మ్యాచ్ ఇవ్వాళ రీ టెలికాస్ట్.. ఎన్ని గంటలకంటే

October 24, 2022

Star Sports to re-telecast the India-Pakistan match

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించిన విషయం తెలిసిందే. చివరి వరకు గెలుపు దోచుబూచులాడిన ఈ మ్యాచులో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఆట పరంగా చూస్తే రోహిత్, కోహ్లీలు పలు రికార్డులు సాధించగా, ఇటు డిజిటల్ ఫ్లాట్‌పాంలో వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నమోదయ్యాయి.

చివరికి ఇండియా గెలవడంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఒకరోజు ముందే దీపావళి వచ్చిందని సంబరపడ్డారు. ఇక సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ సంస్థ మరోసారి ప్రసారం చేయనుంది. రాత్రి 8 గంటలకు స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్ డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్ హిందీ ఛానెళ్లలో ఫుల్ మ్యాచ్ బాల్ టు బాల్ ప్రసారం అవనుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. నిన్న జరిగిన మ్యాచులో ఛేదనకు దిగిన భారత్.. తొలి ఓవర్లలో మంచి ప్రదర్శన చేయలేదు. దాంతో చాలా మంది అభిమానులు టీమిండియా ఓడిపోతుందని భావించి టీవీలు కట్టేశారు. వారి కోసం ప్రత్యేకంగా రీ టెలికాస్ట్ చేస్తున్నారు. అంతేకాక, కోహ్లీ ప్రదర్శనను మరోసారి వీక్షించే అవకాశం దొరుకుతోందని ఆనందపడుతున్నారు. అటు ఈ మ్యాచును డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కోటీ 80 లక్షల మంది వీక్షించారు. ఇది ఆల్ టైం రికార్డుగా చెప్తున్నారు. మరోసారి టెలికాస్ట్ అవుతున్నందును ఇంకెంత మంది చూస్తారో అనే ఆసక్తి నెలకొంది.