Starbucks appoints Indian-origin Laxman Narasimhan as new CEO
mictv telugu

స్టార్‌బ‌క్స్ సీఈవోగా భార‌తీయ సంత‌తి వ్య‌క్తి

September 2, 2022

ప్రపంచ ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్ బక్స్ కార్పొరేషన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్(55)ను నియమిస్తున్నట్లు ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. స్టార్ బక్స్ ప్రస్థుత సీఈఓ హోవార్డ్ సూహుల్ట్‌జ్ స్థానంలో అక్టోబరు 1వతేదీ నుంచి నరసింహన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.లక్ష్మణ్ నరసింహన్ రెకిట్ కంపెనీకి కూడా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రెకిట్ సంస్థ డూరెక్స్ కండోమ్స్, ఎన్ ఫామిల్ బేబీ ఫార్ములా, మూసినెక్స్ కోల్డ్ సిరప్ లను ఉత్పత్తి చేస్తోంది. రెకిట్ సంస్థ నుంచి తాను నిష్క్రమిస్తున్నట్లు లక్ష్మణ్ ప్రకటించగానే ఆ కంపెనీ షేర్లు 4 శాతం పడిపోయాయి.

త‌మ కంపెనీకి రాబోయే సీఈవో ఓ అసాధార‌ణ వ్య‌క్తి అని భావిస్తున్న‌ట్లు స్టార్‌బ‌క్స్ తెలిపింది. అత‌ను ట్యాలెంట్ ఉన్న లీడ‌ర్ అని స్టార్‌బ‌క్స్ బోర్డు చైర్ వుమెన్ మెల్లోడీ హాబ్స‌న్ తెలిపారు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్న ల‌క్ష్మ‌ణ్‌.. స్టార్‌బ‌క్స్ కోసం సియాటిల్ వెళ్ల‌నున్నారు. స్టార్‌బక్స్ సంస్థకు అమెరికాలో 200 కంటే అధిక కాఫీ షాపులున్నాయి. ప్రస్తుతం కొవిడ్ పరిమితుల వల్ల విదేశీ మార్కెట్ లో కాఫీ చైన్ వ్యాపారం మందగించింది. ఈ నేపథ్యంలో నరసింహన్ స్టార్ బక్స్ లో సీఈఓగా చేరబోతున్నారు. గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా నరసింహన్ పనిచేశారు. ప్రపంచ స్థాయి పలు సంస్థలకు భారతీయులు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు.