పెంపుడు జంతువులంటే ఈ నటులకు పిచ్చి..! - MicTv.in - Telugu News
mictv telugu

పెంపుడు జంతువులంటే ఈ నటులకు పిచ్చి..!

July 20, 2017

ఒకప్పుడు  ఇంటికి కాపలాగ ఉంటదని చాలామంది కుక్కలను పెంచుకుంటుండే..కానీ ఇప్పుడైతే చాలామంది  పెంపుడు జంతువులను ఇంట్ల మన్షులెక్కనే  పెంచుతూ వాటిని చాలా ప్రేమగ సూస్కుంటున్నరు,అందుకే అవ్విటికోసాన్కి  ప్రత్యేక దవాఖాన్లు.. ప్రత్యేక ఫుడ్డులు గుడ అచ్చినయ్,అందరేమో గనీ సిన్మోల్లైతె పెంపుడు జంతువులంటే మస్తు పాయిరం జూపిస్తున్నరు,సిన్మలల్ల నటించె యాక్టర్లు..యాక్టరమ్మలు అంటే చానామందికి అభిమానం ఉంటది,కొందరైతె పిచ్చిగ వాళ్లను ఆరాధిస్తరు,అభిమానిస్తరు,కనీ చాలామంది సిన్మోళ్లకు తమ పెంపుడు జంతువులంటే పిచ్చట.

కొందరైతే  వేలు లక్షలు పెట్టి బైటిదేశంల నుంచి గుడ తెచ్చుకుంటరు  సాదుకోనికి.ఇగో గీడ కొందరు బాలీవుడ్ యాక్టర్లు  వాళ్లు మస్తు ప్రేమించే పెంపుడు జంతువులతోని పోట్వదిగి నెట్టుల వెట్టిన్రు,బాలీవుడ్ కింగ్ షారూఖాన్ కు కుక్కలంటే ప్రాణమట,అలియాభట్,సల్మాన్ ఖాన్ ,అనుష్క శర్మ,ప్రియాంక చోప్రా,అమితా బచ్చన్,సోనమ్ కపూర్ అజయ్ దేవ్ గన్,జాక్వలిన్ ఫెర్నాండేజ్,అర్జున్ కపూర్ ఇట్ల  బాలీవుడ్ల పెద్ద స్టార్లంత తమ షూటింగ్ అయిపోగానే  మంచిగ ఇంటికచ్చి  వాళ్ల పెంపుడు జంతువులతోని ఆడుకుంట రిలాక్స్ అయితరట.రాజబోగాలంటే  గీ స్టార్ల దగ్గరున్న  కుక్కలయి ,పిల్లులయే కదా…అందుకే అంటరు ఉన్నోడింట్ల  కుక్కై పుట్టినా అదృష్టంమే అని.