Start a new life with Sushmita..Lalit Modi
mictv telugu

సుస్మితాతో కొత్త జీవితం ప్రారంభించా..లలిత్ మోదీ

July 15, 2022

 

భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నానని, అన్ని కుదిరితే త్వరలో పెళ్లి కూడా చేసుకోవచ్చు అంటూ, కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.

 

”సుస్మితా సేన్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించా. ఇటీవలే ఆమెతో కలిసి ప్రపంచ పర్యటన చేశా. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరం కలిసి డేటింగ్ మాత్రమే చేస్తున్నాం. భవిష్యత్తులో పెళ్లి కూడా జరగవచ్చు” అని శుక్రవారం ఓ ట్విట్ చేస్తూ, సస్మితా సేన్‌తో దిగిన ఫొటోలను పోస్టు చేశారు. ఈ పోస్టు చేయడానికి కారణం ఏంటో కూడా ఆయన తెలిపారు. గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సుస్మితా సేన్‌, లలిత్ మోదీ పెండ్లీ అయిపోయింది అంటూ ఒక్కసారిగా వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆ వార్తలపై స్పందించిన ఇంకా పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

 

ఇక, సుస్మితా సేన్ విషయానికొస్తే.. ఆమె మాజీ విశ్వసుందరి. గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాతో ప్రేమలో పడింది. కొన్నాళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిసి డేటింగ్ కూడా చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్లిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పారు. ప్రస్తుతం ఆమె క్రికెట్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేస్తుంది. లలిత్ మోదీ.. 2010 నుంచి లండన్ ఉంటున్నారు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ కేసులో ఆయన దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇరువురికి సంబంధించిన ఫోటోలు హాట్ టాఫిక్‌గా మారాయి.