హైదరాబాద్‌లో హోటళ్లు ప్రారంభం.. షరతులు వర్తిస్తాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో హోటళ్లు ప్రారంభం.. షరతులు వర్తిస్తాయ్

May 16, 2020

Hyderabad

నెలన్నరకు పైగా సర్వం బంద్ అయింది. లాక్‌డౌన్‌తో జనాలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సడలింపులతో నగరంలో మార్చి నెలలో మూతపడిన పలు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఇప్పటికే తెరుచున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో పలు హోటళ్లు, రెస్టారెంట్‌లు తెరుచుకోనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా, లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి హోటల్‌ నిర్వాహకులు తమ వ్యాపారన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు. 

హిమాయత్‌ నగర్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్‌‌లను శనివారం నిర్వాహకులు తెరిచారు.  ప్రస్తుతం పార్సిల్‌ సర్వీసులను మాత్రమే అందిస్తున్నట్లు వారు చెప్పారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించి, మాస్కులను తప్పినిసరిగా ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదేవిధంగా శానిటైజేషన్‌, థర్మల్‌ టెస్ట్‌ వంటి చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం అతి కొద్ది మంది ఉద్యోగులతో పార్సిల్‌ సర్వీసులు అందిస్తున్నట్లు హోటల్ యజమానులు వెల్లడించారు.