భారత్‌ కోసం సొంత యాప్ స్టోర్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌ కోసం సొంత యాప్ స్టోర్

October 2, 2020

Startup founders bat for an Indian app store.

ఈమధ్య వివిధ విదేశీ యాప్‌లను నిషేధించింన కేంద్రప్రభుత్వం దేశీ యాప్‌ల మీద దృష్టి సారించింది. మరోవైపు భారత్ కోసం సొంత ప్లేస్టోర్‌ను రూపొందే అవకాశం ఉంది. ఏదైనా యాప్ కావాలంటే ఆండ్రాయిడ్ యూజర్ అయితే గూగుల్ ప్లేస్టోర్, ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసేకుంటున్న విషయం తెలిసిందే. లేదంటే థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇకపై భారత్‌కు కూడా  ప్రత్యేకంగా ఓ యాప్ స్టోర్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ విషయమై భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ.. ‘ఆండ్రాయిడ్ స్టోర్‌లో యాప్స్‌లో జరిపే పేమెంట్స్‌పై 30% కమిషన్ తీసుకుంటామని గూగుల్ ప్రకటించడంపై మాకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదు. మన యాప్స్ డౌన్‌లోడ్ చేసేందుకు సొంత ప్లాట్‌ఫామ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. భారత ప్రభుత్వం ఇప్పటికే మొబైల్ యాప్ స్టోర్ నిర్వహిస్తోంది. అందులో 1200 పైగా భారత ప్రభుత్వానికి చెందిన అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ యాప్ స్టోర్‌నే విస్తరించి యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఆలోచించాలి’ అని ఆయన తెలిపారు. 

మరోవైపు గూగుల్ ఎక్కువగా కమిషన్ తీసుకుంటుందన్న ఆందోళన యాప్ డెవలపర్స్‌లో ఉంది. ఈ క్రమంలో ఎక్కువ సర్వీస్ ఛార్జీలు లేకుండా లోకల్ యాప్ స్టోర్ ఉంటే బాగుంటుందని పలు ఇండియన్ స్టార్టప్స్ ఫౌండర్స్ కూడా కోరుతున్నారు. అయితే దీనిపై బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్ కో-ఫౌండర్ విశాల్ గోండాల్ విముఖత వ్యక్తంచేసింది. ‘లోకల్ యాప్ స్టోర్ ఉండటం తప్పనిసరిగా అవసరం. మేం గూగుల్‌కు 30 శాతం ఫీజులు ఇచ్చి, కస్టమర్ల సంఖ్య పెంచేందుకు ఖర్చు చేస్తుంటే చిన్న వ్యాపారాలు ఎలా నిలదొక్కుకుంటాయి?’ అని అభిప్రాయపడ్డారు. 

కాగా, కొద్ది రోజుల క్రితం సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎం యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడంతో ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించినట్టు గూగుల్ వివరణ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని గంటలకు ప్లేస్టోర్‌లో పేటీఎం యాప్ తిరిగి వచ్చింది. గూగుల్ తీరుపై పేటీఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ యాప్‌ను తిరిగి ప్లేస్టోర్‌లోకి తీసుకొచ్చేందుకు సదరు ప్రమోషన్లను తొలగించింది పేటీఎం. యూజర్లకు హాని చేయకుండా, వారిని రక్షించేలా పాలసీలను రూపొందించామని, అందరు డెవలపర్స్‌కి ఇది వర్తిస్తుందని పేటీఎం పేరు ప్రస్తావించకుండా గూగుల్ చెప్పింది. కాగా, ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం, గూగుల్, యాపిల్ ఇంకా స్పందించలేవు.