ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 10, 2023న బ్యాంక్ జారీ చేసిన ప్రకటన ప్రకారం దేశవ్యాప్ంగా ఎస్బీఐ పలు సర్కిల్లో మొత్తం 868 బిసీఎఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. న్యూఢిల్లీ, లక్నో, పాట్నా, జైపూర్, భోపాల్, చండీగడ్ రాష్ట్రాల్లోని బ్యాంకులలో ఖాళీలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. SBI ద్వారా BCF రిక్రూట్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతుంది. రిటైర్డ్ PSB ఉద్యోగులు మాత్రమే ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులు గమనించాలి.
ఎస్‌బిఐ ద్వారా ప్రకటించిన బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ (బిసిఎఫ్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుండి కెరీర్ విభాగంలో లేదా క్రింద ఇచ్చిన లింక్ నుండి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 31, 2023 వరకు సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా, అభ్యర్థులు ముందుగా నమోదు చేసుకోవాలి. ఆపై నమోదు చేసిన వివరాలతో లాగిన్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే అవకాశం ఉంటుంది.
SBIలో BCF రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు బ్యాంక్ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను తప్పక చదవాలి.