తెలంగాణ టూరిజం థీమ్ సాంగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ టూరిజం థీమ్ సాంగ్..

October 25, 2017

తెలంగాణ పర్యాటక శాఖ.. తన థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. అందమైన ప్రకృతి, చారిత్రక నిర్మాణాల దృశ్యాలతో దీన్ని తీర్చిదిద్దారు.  

ప్రఖ్యాత కవి దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ పదాలతో ఇది మొదలవుతుంది. తెలంగాణ ప్రజాజీవితాన్ని, సంస్కృతిని, బోనాల పండుగ, ముఖ్యమైన చెరువులు, జలపాతాలు వంటి వాటిని ఇందులో చిత్రీకరించారు. గోల్కొండ కోట, చార్మినార్, కాకతీయ కళాతోరణం,  లక్నవరం చెరువులు కనివిందు చేస్తాయి. ఈ పాట చిత్రీకరణకు దూలం సత్యనారాయణ దర్శకత్వం వహించారు. కమ్రన్ సంగీతాన్ని స్వరాలను అందించారు. సాహిత్యాన్ని బద్రీ గాజుల, అక్కల చంద్రమౌళి వర్మ అందించారు.