వలస కూలీలపై సుప్రీంకోర్టు వరాల జల్లు…
లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఎన్నో ఇబ్బందులు పడుతోన్న సంగతి తెల్సిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరకొర ఏర్పాట్ల కారణంగా ఎందరో వలస కూలీలు ఇళ్లకే చేరుకునే మార్గంలోనే మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలసకూలీల సమస్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యాలు చేసింది.
వలస కార్మికుల తరలింపు కోసం వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేయవద్దని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వాలే వలస కూలీలకు ఆహారం, నీరు అందించాలని తెలిపింది. వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశాయి. వీటి కోసం అయిన ఖర్చును రాష్ట్రాలే భరించాలి. కానీ, కొన్ని రాష్ట్రాల్లో వలస కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యాలు చేసింది. వలస కూలీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా వారు తమ గమ్యస్థానాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని వెల్లడించింది. రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లే వలస కూలీలను వెంటనే ఆపేయాలి. వారిని షెల్టర్లకు తరలించాలి. వారికి ఆహారం, సదుపాయాలు అందించాలని సుప్రీం తెలిపింది. సుప్రీం కోర్టు తీసుకున్న చొరవతో వలస కార్మురికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.