States showing warning signs of stress; need corrective action: RBI article
mictv telugu

భారీ అప్పుల్లో ఆ 5 రాష్ట్రాలు.. ఏపీ కూడా.. ఆర్బీఐ ఆందోళన

June 17, 2022

States showing warning signs of stress; need corrective action: RBI article

దేశంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో పలు రాష్ట్రాల అప్పులు వివరాలను ప్రకటిస్తూ.. ఆయా రాష్ట్రాలపై అప్పుల భారం తీవ్ర స్థాయికి చేరిందని ఆందోళనలు వ్యక్తం చేసింది. దేశంలోనే అత్యధికంగా అప్పుల భారం పడుతున్న 5 రాష్ట్రాలు ఇందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ కథనంలో పేర్కొంది. అత్యధికంగా అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో పంజాబ్, రాజస్థాన్, బీహార్, కేరళ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయని , ఆ ఖర్చు బడ్జెట్ పరిమితులను దాటుతోందని చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్రా ఆధ్వర్యంలోని ఆర్థికవేత్తల బృందం దీనిపై ఓ కథనాన్ని రాసింది. ఆర్టికల్‌లో ఇచ్చిన అభిప్రాయాలు రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలు కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

అప్పుల భారం ఎక్కువగా ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్దారించిన రుణ, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్‌ దాటేసిందని ఆర్‌బీఐ వివరించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అధికంగా జీఎస్‌డీపీలో 9 శాతం బ్యాంక్ గ్యారంటీలను ఏపీ రాష్ట్రం ఇచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.