Statue of goddes mahalakshmi with open eyes in Kadiyapulanka
mictv telugu

కార్తీకమాసం వేళ కళ్లు తెరచిన అమ్మవారి విగ్రహం.. వీడియో

November 22, 2022

తూర్పుగోదావరి జిల్లా కడియపు లంకలో వింత ప్రచారం జరుగుతోంది. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కళ్లు తెరచిందనే వార్త దానావలంలా వ్యాపించింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసుకొని ఉంటాయి లేదా సగం తెరచి ఉంటాయి.

కానీ కడియపులంకలో మహాలక్ష్మి విగ్రహం పూర్తిగా తెరచి ఉండడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. విగ్రహాన్ని చూడడానికి ఉత్సాహం చూపించారు. కార్తీక మాసం నడుస్తున్న వేళ ఇలా జరగడం అంతా దైవ మహిమ అంటూ కొలుస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విగ్రహాన్ని చూస్తే కళ్లు తెరచి ఉందని, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదని ఓ మహిళ తన్మయత్వంతో చెప్తోంది. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో అమ్మవారు భక్తులను అనుగ్రహించిందని గ్రామస్థులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్త చర్చకు దారి తీసింది.