రేపే మహాత్ముని జయంతి అనగా… గాంధీ విగ్రహానికి అవమానం.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపే మహాత్ముని జయంతి అనగా… గాంధీ విగ్రహానికి అవమానం..

October 1, 2018

భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి  ఘోర అవమానం జరిగింది. రేపే గాంధీ జయంతి అనగా ఇంతటి అవమానమా ? ఎవరు, ఎందుకు ఈ పని చేశారు ?  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని మధువాడలో ఈ ఘటన జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేశారు. కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. గాంధీ జయంతికి ఒక్కరోజు ముందు ఈ అవమానం జరిగడం స్థానికంగా కలకలం రేపుతోంది. గాంధీ విగ్రహాం చేతిని, కాళ్లను ద్వంసం చేశారు. ఈ పని చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.