రోజుకు రూ.40 లక్షలు.. ఖర్చు పెట్టడమే ఆమె ఉద్యోగం
ప్రతీరోజూ ఉంట్లోనే ఉంటూ రోజుకు రూ.40 లక్షలు ఖర్చు చేస్తోంది ఓ యువరాణి. తల్లిదండ్రుల సంపాదనను ఖర్చు చేస్తూ.. అది ఒక ప్రోఫెషనల్ జాబ్ గా ప్రకటించుకుంది. స్టే ఎట్ హోమ్ డాటర్ అంటే ఇంట్లో ఉండే కుమార్తెను తాను అంటూ తనకు తానే పిలుచుకుంటోంది. న్యూయార్క్‌కు చెందిన రోమా అబ్దెస్లామ్ ఓ టిక్‌టాక్ సెలబ్రిటీ. టిక్‌టాక్‌లో ఇప్పటివరకు ఆమెను దాదాపు 79,000 మంది ఫాలో అవుతున్నారు. ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటీ అందరినీ షాక్‌కు గురి చేసింది. తన రోజువారి పాకెట్ మనీ అమెరికా విలువలో 50 వేల డాలర్లు అంటే భారతీయ విలువలో దాదాపు 40 లక్షల రూపాయలని తెలిపింది.
రోజూ పొద్దున్నే లేచి జిమ్ కి వెళ్లడం, ఫ్రెండ్స్ తో కలసి షాపింగ్ కి వెళ్లడమే ఆమె జాబ్. ఇందుకోసం రోజుకీ 50 వేల యూఎస్ డాలర్లు ఖర్చు పెడుతుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు. మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఆమె తన కనుబొమ్మలను అందంగా మార్చడానికి 600 డాలర్లు(భారత కరెన్సీలో 47,370 రూపాయలు) ఖర్చు చేసినట్లు చెప్పింది. ఇంకో విషయమేంటంటే.. తనకు ఇజ్రాయెలీ పాఠశాలల పట్ల చాలా మక్కువని, విద్య ఆధారిత స్వచ్ఛంద సంస్థలకు డబ్బును విరాళంగా అందజేస్తుంటాని రోమా తెలిపింది. జమైకాలోని ఒక పాఠశాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పింది.