గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చతికిల పడ్డాయి. మరో నెలపాటు లాక్డౌన్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేవరకు కేసులు తగ్గవని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు ఇంకెంత కాలం ఇళ్లలో ఖాళీగా ఉండగలరనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ”కరోనా భయంతో ప్రజలు ఎన్ని రోజులని ఇంట్లో ఉంటారు? గుజరాతీయుల ఆర్థిక కార్యకలాపాల కోసం ఇళ్లలోనుంచి బయటికి రాక తప్పదు. ఇంట్లో కూర్చుని ‘కరోనా కరోనా’ అనడం వల్ల ఏం లాభం లేదు. ప్రజలు భయటికి వెళ్లి పని చేసుకోవడం మంచింది. కార్మికులు, కూలీలు, కాంట్రాక్టర్లు తమ పనులు ప్రారంభించుకోవాలని చూస్తున్నారు.” నితిన్ భాయ్ అన్నారు.