Steam water boiler explosion in Srisailam temple
mictv telugu

దేవస్థానం నిత్య అన్నదానం వద్ద బాయిలర్ పేలుడు..

November 1, 2022

శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో ప్రమాదం జరిగింది. మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారంనాడు స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది. భక్తులకు భోజనం, అల్పాహారం తయారీకి వినియోగించే వంటగదిలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్‌ఎస్‌ ట్యాంక్, అక్కడ ఉన్న సామగ్రి ఎగిరిపడ్డాయి. ఆ సమీపంలో పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. నిత్య అన్నదానం బయటవైపు ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రెషర్ కారణంగానే బాయిలర్‌ పేలిందని అధికారులు చెబుతున్నారు.