'వాన్న క్రై' వైర‌స్.. సైబ‌ర్ ఎటాక్ నుంచి తప్పించుకోండిలా.. - MicTv.in - Telugu News
mictv telugu

‘వాన్న క్రై’ వైర‌స్.. సైబ‌ర్ ఎటాక్ నుంచి తప్పించుకోండిలా..

May 15, 2017

 


‘వాన్న క్రై (Wanna Cry)’… ప్రపంచ దేశాలను ఇప్పుడీ ర్యాన్సమ్‌వేర్ షేక్ చేస్తోంది. సుమారు 100కి పైగా దేశాల్లో ఉన్న అనేక రంగాలకు చెందిన సంస్థల కంప్యూటర్లు ఈ ర్యాన్సమ్‌వేర్ ఎఫెక్ట్ తో భారీగా నష్టాపోయి. . వాన్నక్రై సృష్టికర్తలు మరో కొత్త వైరస్‌తో మరోసారి దాడి చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని సంస్థలు తమ కార్యాలయాల్లో ఉండే కంప్యూటర్లకు భద్రత కట్టుదిట్టం చేసే పనిలో పడ్డారు. ఇంతకీ అసలు ఈ ర్యాన్సమ్‌వేర్ అంటే ఏమిటి..? అది ఎలా వ్యాపిస్తుంది..? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

వైరస్‌లలో ఒక రకం..
ర్యాన్సమ్‌వేర్ అనేది వైరస్‌లలో ఒక రకానికి చెందినది. ఇది కంప్యూటర్‌లోకి ప్రవేశించాక యూజర్‌కు చెందిన ఫైల్స్ అన్నింటినీ లాక్ చేస్తుంది. ఈ క్రమంలో యూజర్ ఒక వేళ ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేయాలని చూస్తే అప్పుడు అవి ఓపెన్ కావు. పైగా ఫైల్స్ లాక్ అయ్యాయని, కొంత డబ్బు కడితేనే ఆ ఫైల్స్ మళ్లీ అన్‌లాక్ అయి ఓపెన్ అవుతాయని, వీలైనంత త్వరగా డబ్బు కట్టకపోతే ఫైల్స్ అనీ ఎరేజ్ అవుతాయని ఓ మెసేజ్ కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్ ఆ మెసేజ్‌లో కనిపించిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. అది నేరుగా హ్యాకర్ల ఖాతాలోకి చేరుతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అటాక్ అయిన వాన్న క్రై కూడా ర్యాన్సమ్‌వేర్ విభాగానికే చెందుతుంది. ఇప్పటికే ఈ వైరస్ సోకిన చాలా కంప్యూటర్లకు చెందిన యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు తెలిసింది.

ర్యాన్సమ్‌వేర్ నుంచి తప్పించుకోవాలంటే ఇలా ..!
1. గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఈ-మెయిల్స్ అస్సలు ఓపెన్ చేయవద్దు. వాటిలో పైన చెప్పినటువంటి అటాచ్‌మెంట్లు ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక అలాంటి మెయిల్స్ వస్తే వెంటనే వాటిని డిలీట్ చేయాలి తప్ప ఓపెన్ చేయకూడదు.

2. యూజర్లకు వచ్చే ఈ-మెయిల్స్‌లో .wncry, wannaDecryptor, Wanna Decryptor 1.0, Wana Decrypt0r, Wana Decryptor, WANNACRY, WanaCrypt0r, WANACRY!, [email protected] తరహా సబ్జెక్ట్ లేదా అటాచ్‌మెంట్లు ఉంటే అస్సలు ఓపెన్ చేయరాదు. వాటిని డిలీట్ చేసేయాలి.

smb

3. మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సర్వర్ మెసేజ్ బ్లాక్ (SMB) అనే ప్రొటోకాల్‌లో ఉన్న లోపం ద్వారా కూడా ర్యాన్సమ్‌వేర్ వ్యాపిస్తున్నట్టు తెలిసింది. కనుక ఆ ప్రొటోకాల్‌ను డిసేబుల్ చేయాలి. అందుకు విండోస్ పీసీ యూజర్లు Control Panel –> Programs –> Windows Features అనే ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ లిస్ట్‌లో ఉండే SMB 1.0/CIFS File Sharing Support అనే ఆప్షన్‌కు ఉండే చెక్ మార్క్ తీసేయాలి. దీంతో ర్యాన్సమ్‌వేర్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు.

4. అశ్లీల వెబ్‌సైట్‌లు, పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌లు, సినిమాలు, పాటలు, వీడియోలు, ఫొటోలు ఉండే వెబ్‌సైట్లను ఓపెన్ చేయరాదు.

5. మాక్ లేదా విండోస్ పీసీ ఏది వాడినప్పటికీ యూజర్లు ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడాలి. పైరేటెడ్ వెర్షన్ వాడకూడదు. అలా వాడితే సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఆయా కంపెనీలు విడుదల చేసే సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు వీలుండదు.

6. విండోస్ పీసీ యూజర్లు తాజాగా విడుదలైన MS17-010 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

7. యూజర్లు ముఖ్యమైన డేటానంతా సీడీలు, డీవీడీలు లేదా ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లలోకి ఎప్పటికప్పుడు కాపీ చేసుకోవాలి. ఇలా చేస్తే ఒక వేళ ర్యాన్సమ్‌వేర్ అటాక్ అయినా నష్టం ఉండదు. పీసీని వెంటనే ఫార్మాట్ చేసుకుని ఎప్పటిలా వాడుకోవచ్చు. అయితే అలా జరిగినప్పుడు సురక్షితంగా ఉండేలా మంచి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

8. కాస్పర్ స్కై, ఏవీజీ, అవాస్ట్, నార్టన్ వంటి సంస్థలు యాంటీ వైరస్, ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లను అందిస్తున్నాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటే ఇలాంటి ర్యాన్సమ్‌వేర్‌ల బెడద తప్పుతుంది.

9. విండోస్ పీసీల్లో ఆఫీస్ 365 ఎడిషన్ వాడే వారు అందులో Advanced Threat Protection అనే ఫీచర్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేస్తే ఎలాంటి అటాచ్‌మెంట్ల నుంచి అయినా పీసీకి రక్షణ లభిస్తుంది. అలాంటి ర్యాన్సమ్‌వేర్‌లు అటాచ్‌మెంట్ల రూపంలో వస్తే ఈ ఫీచర్ వెంటనే వాటిని బ్లాక్ చేస్తుంది. తద్వారా కంప్యూటర్ సురక్షితంగా ఉంటుంది.

10. కంప్యూటర్‌లో ఎప్పటికప్పుడు పేరుకుపోయే జంక్ ఫైల్స్, హిస్టరీ, కుకీస్‌ను క్లీన్ చేసుకోవాలి. అందుకు CCleaner వంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగపడతాయి. దీని వల్ల వైరస్‌లు ఆ జంక్ ఫైల్స్‌లో స్టోర్ కావు.

HACK:

  • Steps to avoid Wannacry Ransomware attack.
  • Don’t open mails from unknown persons.
  • If any mail received by the name Wanacry, then don’t open it.