Steve Smith passes Sir Donald Bradman on Australia's all-time list for most Test centuries
mictv telugu

స్టీవ్ స్మిత్ మరో సెంచరీ.. బ్రాడ్‌మాన్‌ రికార్డు బద్దలు..

January 5, 2023

Steve Smith passes Sir Donald Bradman on Australia's all-time list for most Test centuries

ఆసీస్ స్టార్ బ్యాట్స్‎మెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే తన పేరిట పలు రికార్డులు నెలకొల్పిన స్మిత్ ఇప్పుడు కొత్త మైలురాయిని అందుకున్నాడు. సెంచరీలలో క్రికెట్ లెజెండ్ సర్‎డాన్ బ్రాడ్‌మాన్‌ను స్మిత్ అధిగమించాడు. సిడ్నీవేదికగా సౌతాప్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో స్మిత్ (192 బంతుల్లో 104, 11ఫోర్లు, 2 సిక్సర్లు ) 30వ సెంచరీ సాధించాడు. దీనిద్వారా బ్రాడెమెన్ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఆసీస్ తరఫున సెంచరీలు సాధించిన లిస్ట్‎లో మూడో స్థానంలో ఉన్నాడు. అతడికంటే ముందు రికీ పాంటింగ్(41), స్టీవ్ వా(32) ఉన్నారు. మాథ్యూ హేడెన్ (30)తో స్మిత్ సమంగా నిలిచాడు. అయితే వారందరూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో స్మిత్ తర్వాత స్థానంలో వార్నర్ (25సెంచరీలు) ఉన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 475 పరుగులు భారీ స్కోర్ చేసింది. స్మిత్ తో పాటు ఉస్మాన్ ఖవాజా (368 బంతుల్లో 195)*సెంచరీ సాధించి డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. లబూషేన్ 79, హడె 70 పరుగులతో రాణించారు. ఖవాజాతో పాటు రెన్ షా 5 పరుగులతో క్రీజ్‎లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో అన్రిచ్‌ నోర్జే రెండు వికెట్లు, రబాడా, మహరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.