ఆర్ఆర్ఆర్ మూవీ అందులో యాక్టర్లు, దర్శకుడి దశను పూర్తిగా మార్చేసింది. ఫుల్ ఫేమస్ అయిపోయారు ఒక్క దెబ్బకు. ఎంత అంటే స్టీవెన్ స్పీల్ బర్గ్ ను ఇంటర్వూ చేయడానికి కూడా మన రాజమౌళి కావల్సి వచ్చాడు. ఏంటి నమ్మడం లేదా. స్టీవెన్ స్పీల్‌బర్గ్ ‘ది ఫేబుల్‌మ్యాన్స్’ సినిమా హాలీవుడ్ లో ఎప్పుడో రిలీజ్ అయినా తాజాగా ఇండియాలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 10న ఇండియాలో ఈ సినిమా రిలీజయింది. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ రాజమౌళితో చేయించారు.ఆ మూవీ దర్శకుడు స్పీల్ బర్గ్ ను రాజమౌళితో ఇంటర్వ్యూ చేయించారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ లో ఉంది.
ఇంటర్వ్యూలో స్పీల్ బర్గ్ ని రాజమౌళి సినిమా గురించి ప్రశ్నలు అడిగారు. ఈ సినిమా ఆల్మోస్ట్ తన లైఫ్ అని, నా చిన్నప్పుడు లైఫ్, నా చుట్టూ ఉన్న పరిస్థితులు, సినిమా మీద ఉన్న ప్రేమ.. ఇవన్నీ కలిపి తీశానని చెప్పారు స్టీవెన్ స్పీల్‌బర్గ్. సినిమాలు తీసి ఇప్పుడు నా గురించి ఏమన్నా చెప్పొచ్చా అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది అని తెలిపారు స్టీవెన్ స్పీల్‌బర్గ్. రాజమౌళి కూడా ది ఫేబుల్‌మ్యాన్స్ సినిమా చూశానని, తనకి చాలా బాగా నచ్చింది అని అన్నారు. ఇలా ది ఫేబుల్‌మ్యాన్స్ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుతూ ప్రమోషన్స్ చేశారు.
పనిలో పనిగా స్పీల్ బర్గ్ రాజమౌళిని మరోసారి అభినందించేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా తనకు చాలా నచ్చిందని చెప్పారు. దానికి బదులుగా రాజమౌళి మీరు అలా అంటుంటే నాకు డాన్స్ చేయాలని ఉందంటూ సంబరపడిపోయారు.