ఐపీఎల్లో రాణించి రెండేళ్ల కిందట టీం ఇండియాలోకి వచ్చిన మిస్టర్ 360 అద్భుతంగా ఆడుతున్నాడు. క్రికెట్ ప్రపంచానికి కొత్త షాట్లను పరిచయం చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. తక్కువ కాలంలోనే జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకొని దానిలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు మరో ఘనత సాధించాడు మిస్టర్ స్కై. కొత్త సంవత్సరంలో కొత్త బాధ్యతలను సూర్యకుమార్‌కు బీసీసీఐ అప్పగించింది. వచ్చే ఏడాది శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు ఇటీవల టీం ఇండియా జట్టును ప్రకటించారు. వన్డేలకు రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు వహిస్తుండగా.. టీ20లకు మాత్రం కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. ఇక టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది.
వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ రావడంపై సూర్యకుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. కొత్త బాధ్యతలను అసలు ఊహించలేదని తెలిపాడు. ఏడాది పాటు నిలకడగా ఆడుతున్న ఆటకు ఇది రివార్డుగా భావిస్తున్నట్లు తెలిపాడు. కొత్త బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ముందుగా తన తండ్రి చూసి తెలిపారని వెల్లడించాడు. వైస్ కెప్టెన్ గా ఎంపికైనందుకు ఒత్తిడికి గురి కాకుండా.. నీ బ్యాటింగ్‌ను అస్వాదించామని మెసేజ్ చేసినట్లు స్కై తెలిపాడు.
సూర్యకుమార్ యాదవ్ 2022లో 31 టీ20లు ఆడి 1164 పరుగులు చేశాడు. టీ 20 ప్రపంచ్ కప్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత టీం ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడు నిలిచాడు. జట్టులోకి రావడానికి పదేళ్లు ఎదురచూసిన 32 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్..జట్టులోకి వచ్చిన రెండేళ్లకే వైస్ కెప్టెన్సీ పదవి దక్కింది. ఇదే ఊపుతో బ్యాటింగ్ కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు, రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
బుర్జ్ ఖలీఫాను వర్షం నుంచి కాపాడే గొడుగు!
చైనాలో ఇండియన్ మందులకు భారీ డిమాండ్..