Stock market themed wedding invitation card gone to viral
mictv telugu

స్టాక్ మార్కెట్ థీమ్ వెడ్డింగ్ కార్డ్ వైరల్!

December 5, 2022

ఇండియాలో పెండ్లిళ్ల సీజన్ మొదలైంది. ఒక్కొక్కరు తమ తాహతకు తగినట్లు ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరు యూనిక్ గా ఉండాలనుకుంటారు. అలా అనుకున్న ఓ జంట పెండ్లి కార్డు ఇప్పుడు వైరల్ అయింది.పెండ్లంటే ఎంత ఆర్భాటం, హంగు ఉంటుంది. పెండ్లి కుదిరిన దగ్గర నుంచి అందరిలో యూనిక్ గా ఉండాలనుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. పెండ్లి రోజు మరింత కొత్తగా ఉండాలంటే బంధువులంతా తమ గురించే మాట్లాడుకోవాలనుకుంటారు వధూవరులు. అందుకే అందించే ఆహ్వాన పత్రిక కూడా కొత్తగా ఉండాలనుకుందో జంట. మహారాష్ట్రకు చెందిన ఒక జంట కూడా అలాగే ఆలోచించింది. ఇద్దరూ మెడికోలు అయినా వారికి స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంది. అంతకుమించి ఇష్టమూ ఉంది. దాన్ని చూపించడానికి సమయం వచ్చేసిందని తమ పెండ్లి పత్రికలో స్టాక్ మార్కెట్ పదజాలాలతో నింపేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పత్రిక పాపులర్ అయిపోయింది.

ఈ పత్రికలో.. డాక్టర్ సందేశ్ మెడిసిన్ లిమిటెడ్, డాక్టర్ దివ్య అనస్థీషియా లిమిటెడ్ అంటూ రాసి వారి పేర్లతో పాటు, హోదాలను జతచేశారు. జంట వివాహాన్ని ‘మెరజర్’ అని, అతిథులను ‘ఇన్వెస్టర్’ అంటూ సంభోదించారు. జున్ జున్ వాలా, వారెన్ బఫ్పెట్, హర్షదయాల్ మెహతా వంటి ప్రముఖ పెట్టుబడిదారుల పేర్లు కూడా ఆహ్వాన పత్రిక పై భాగంలో రాశారు. అక్కడ మామూలుగా అయితే దేవుడి ఆశ్వీరాదం అంటూ రాస్తారు. ఈ పెండ్లి పత్రికను ‘ద స్టాక్ మార్కెట్ ఇండియా’ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ కార్డ్ వైరల్ గా మారింది. చాలామంది వెన్యూ చెప్పండి.. మా షేర్లు పంపిస్తాం అంటూ కామెంట్ పెడుతున్నారు. మరికొందరు ఫన్నీగా, సిల్లీగా కామెంట్ చేస్తున్నారు. సో.. మీరు కూడా ఆ కార్డు అందుకోండి మరి!!!