stock market update
mictv telugu

లాభాల బాటలో దేశీ స్టాక్ మార్కెట్స్

December 21, 2022

stock market update

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా బాగానే ఉండడంతో దేశీయ మార్కెట్ ఊపు ఉన్నట్టు కనిపిస్తోంది. 9.35 గంటల సమయానికి సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 61, 830 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 18, 423 దగ్గర ట్రేడ్ అవుతోంది. రూపాయి విలువ 82.68లుగా ఉంది. హెచ్ సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ లాభాల్లో ఉండగా, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎల్అండ్ టీ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి.

నిన్న అమెరికా మార్కెట్లు స్వల్ప లాబాలతో క్లోజ్ అయ్యాయి. వరుసగా నష్టాలను చవిచూ్తున్న ఈ మార్కెట్లకు మొత్తానికి బ్రేక్ పడింది. దాని ప్రభావమే ఈరోజు ఆసియా-పసిఫిక్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయని అంటున్నారు మార్కెట్ ఎనలిస్టులు. అయితే చైనాలో కరోనా విజృంభణ మార్కెట్ల మీద కూడా ప్రభావం చూపించొచ్చని, మదుపర్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. షేర్లను కొనుగోలు చేసే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈరోజు డాబర్ ఇండియా, గెయిల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ స్టాక్స్ మీద దృష్టి పెట్టొచ్చని చెబుతున్నారు.