stock-market-update-sensex-crashes-928-pts-ends-below-60k
mictv telugu

నాలుగు రోజులుగా నష్టాల్లో షేర్ మార్కెట్లు

February 22, 2023

stock-market-update-sensex-crashes-928-pts-ends-below-60k

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని నెగటివ్ సెంటిమెంట్ నడుస్తుండడంతో దేశీయ మార్కెట్ల మీదనా ఆ ప్రభావం పడింది. ఉదయమే బలహీనంగా ప్రారంభై రోజంతా అదే ట్రెండ్ ను కొనసాగించాయి. సెన్సక్స్ ఓ దశలో 950 పాయింట్లకు పైగా నష్టపోయింది. బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈరోజు ట్రేడింగ్ లో 3.5 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది.

ఈరోజు ఉదయం సెన్సెక్స్ 60 వేల 391.86 పాయింట్ల దగ్గర నష్టాలతో ప్రారంభైంది. ఇంట్రాడేలో 59 వేల 681.55 దగ్గర కనిష్టాన్ని చూసింది. చివరకు 927.74 పాయింట్ల నష్టంతో 59,744.98 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,755.35 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17, 529.45 దగ్గర మొత్తం రోజులో అత్యతంత తక్కువ స్థాయిని నమోదు చేసుకుంది. చివరకు 272.40 పాయింట్లు నష్టపోయి 17,554.30 దగ్గర దగ్గర ముగిసింది.

మన దేశీ మార్కెట్ అంతలా కుప్పకూలిపోవడానికి కారణం 2023లోనే అమెరికా మర్కెట్లు మంగళవారం అతి పెద్ద నష్టాన్ని నమోదు చేసుకున్నాయి. దాంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు అదే బాటలో నడిచాయి. ఈరోజు సెన్సెక్స్ సూచీలో ఒక్క ఊటీసీ మాత్రమే లాభపడింది. బజాజ్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, హఎచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్అండ్టీ, ఎన్పీటీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

మార్కెట్లు పతనంతో అదానీ షేర్లు మరింతగా పడిపోయాయి. కంపెనీయే కావాలని అనుకూల వ్యాసాలు రాయించిందని వికీపీడియా చేసిన ఆరోపణలు ఈరోు షేర్ల మీద ప్రభావం చూపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ విల్మర్ షేర్లు 5శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్ ని తాకాయి. అదానీ ఎంట్రప్రైజెస్ షేర్ అన్నికంటే ఎక్కువగా 11.08 శాతం నష్టపోయింది.