స్టాక్ మార్కెట్లు రికార్డ్ సృష్టించాయి. ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ రికార్డు క్రియేట్ చేసింది. మొట్టమొదటి సారి నిఫ్టీ పది వేల మార్క్‌ను దాటింది. అటు సెన్సెక్స్ కూడా 32,374 పాయింట్లకు చేరుకుంది. పది వేల మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించిన నిఫ్టీ ఇవాళ 44.90 పాయింట్లు గెయిన్ అయింది. దీంతో ఆల్ టైమ్ హై 10,011 పాయింట్లకు చేరింది. నిఫ్టీ సోమవారం 9982 పాయింట్ల దగ్గర నిలిచిపోయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం తగ్గింది. ఇవాళ జరిగిన ట్రేడింగ్‌లో హీరో మోటోకార్ప్, భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఎంఎం, డాక్టర్ రెడ్డిస్, అదాని పోర్ట్స్ కంపెనీలు ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. ఈ ఏడాది నిఫ్టీ సుమారు 22 శాతం వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది టాప్ పర్ఫార్మర్లలో నిఫ్టీ నిలవడం హైలైట్.