Stomach gas problem can be checked with these tips
mictv telugu

ఈ నీళ్లు అరగ్లాసు తాగుతే చాలు..పొట్టలో నొప్పి, గ్యాస్ ఎసిడిటీ పరార్ అవుతుంది..!!

January 18, 2023

Stomach gas problem can be checked with these tips

నేటికాలంలో చాలామంది ఇంటి ఫుడ్‎కు చెక్ పెట్టి జంక్ ఫుడ్‎కు అలవాటు పడ్డారు. సమయానికి ఆహారం తినకపోవడం, అధికంగా మసాలాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యతో ఎక్కువమంది బాధపడుతున్నారు. కడుపులో గ్యాస్ సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ సమస్య రాగానే చాలామంది మందులు వేసుకుంటారు. మందులతో కాకుండా ఇంటి చిట్కాల ద్వారానే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇంటిచిట్కాలను చాలా మంది ఫాలో అవుతుంటారు. దీని కోసం అరస్పూన్ ధనియాలు, అరస్పూన్ జీలకర్ర , అరస్పూన్ సొంపు , 3 మిరియాలు , చిన్న అల్లం ముక్కలను దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్లు అందులో పోసిన తర్వాత తయారు చేసిన ధనియాల పొడిని వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. బాగా మరిగాక గ్లాసులో వడకట్టి తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం ఈ నీళ్లు తాగినట్లయితే..మంచి ఉపశమనం లభిస్తుంది.

గోరువెచ్చగా ఉన్నప్పుడే
ఈ నీళ్లను గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా మూడు రోజులు తాగినట్లయితే గ్యాస్ సమస్య నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. అయితే గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి. డాక్టర్ సలహాలను పాటిస్తూ…ఇంటి చిట్కాలను ఫాలో అవుతే తొందరగా తగ్గుతుంది.

ఈ నీళ్లను తాగటం వల్ల గ్యాస్ సమస్య తగ్గడంతోపాటు అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ఈ డ్రింక్ తాగేందుకు ప్రయత్నించండి.