Stone attack on hero Vishal’s house.. Mirrors destroyed.
mictv telugu

కారులో వచ్చి.. హీరో విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి

September 28, 2022

తమిళ హీరోలకు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉంది. అలాంటి పాపులారిటీ ఉన్న హీరోల్లో విశాల్ ఒక‌రు. హీరోగా, నిర్మాతగా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఆయన ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారన్న వార్త ప్రస్తుతం తమిళనాడులో కలకలం రేపుతోంది. చెన్నైలోని అన్నాన‌గ‌ర్‌లో త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటున్నారు విశాల్. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఇంటిపై కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాళ్ల దాడి చేసినట్లు. రెడ్ క‌ల‌ర్ కారులో వ‌చ్చిన దుండ‌గులు విశాల్ ఇంటిపై రాళ్లు విసిరారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో రెడ్ కల‌ర్ కారుని గుర్తించారు. విశాల్ త‌న మేనేజ‌ర్ ద్వారా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనలో విశాల్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. షూటింగ్‌ నిమిత్తం విశాల్‌ బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. విశాల్.. ఓ స్పెషల్ ఇమేజ్ వచ్చిన తర్వాత సినిమాల‌కే ప‌రిమితం కాకుండా.. కోలీవుడ్‌లో న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శిగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. ఉండే విశాల్ అంటే ప‌డ‌ని వారు చాలా మంది ఉన్నార‌నేది కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఈ ఏడాది ప్రారంభంలో సామాన్యుడు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన విశాల్‌.. త్వ‌ర‌లోనే లాఠీ చిత్రంతో రానున్నారు. మ‌రో వైపు మార్క్ ఆంటోని అనే పీరియాడిక్ సినిమాలోనూ న‌టించ‌బోతున్నారు. తెలుగులో పందెం కోడి, పొగ‌రు వంటి చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన మాస్ ఇమేజ్‌ను ద‌క్కించుకున్నారు.