అర్జున్ రెడ్డి ని నిలిపివేయాలి - వి.హెచ్ - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ రెడ్డి ని నిలిపివేయాలి – వి.హెచ్

August 29, 2017

కాంగ్రెస్ మాజీ మంత్రి వి. హనుమంత రావు ‘ అర్జున్ రెడ్డి ’ సినిమాను అస్సలు వదలిపెట్టేది లేదన్నట్టే బిహేవ్ చేస్తున్నారనిపిస్తోంది. తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ సినిమానైనా నిలపివేయాలి, లేదంటే మాదకద్రవ్యాల కేసు దర్యాప్తునైనా ఆపేయాలని డిమాండ్‌ చేశారు. ఆ మధ్య సిటీ బస్సు మీద ఆ సినిమా పోస్టర్ ను చించేసాడు. అప్పుడు హీరో విజయ్ దేవరకొండ ‘ చిల్ తాతయ్య ’ అని తనదైన శైలిలో ఆన్సరిచ్చాడు. అందుకు కౌంటర్ గా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. ఇప్పడు మళ్లీ వీహెచ్ స్పందించాడు. ఆ సినిమాలో డ్రగ్స్‌ తీసుకొని ఆపరేషన్లు చేసిన దృశ్యాలు ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

డాక్టర్లు డ్రగ్స్ తీస్కొని ఆపరేషన్లు చేయడం వంటి దృశ్యాలు కృతకంగా వున్నాయంటున్నాడు. ఈ చిత్రాన్ని చూసిన మంత్రి కేటీఆర్‌ ఈ సినిమా బాగుందని అనడం హాస్యాస్పదంగా వుందని ఇప్పుడు తన ఒపీనియన్ను కరెక్టుగా చెప్పాలన్నారు. సినిమాలోని దృశ్యాలపట్ల వైద్యులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. అర్జున్‌రెడ్డి సినిమాతో పిల్లలు చెడిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌పై సీరియస్‌గా స్పందిస్తున్న ప్రభుత్వం ఈ చిత్రంలో డ్రగ్స్‌ దృశ్యాలు వాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చూడాలి మరి ఇప్పుడు అటు ప్రభుత్వం గానీ ఇటు అర్జున్ రెడ్డి చిత్ర బృందం గానీ వీహెచ్ మాటలకు ఎలా స్పందిస్తారో చూడాలి ??