మహిళల మీద ఈ దాడులు ఆగవా ? - MicTv.in - Telugu News
mictv telugu

మహిళల మీద ఈ దాడులు ఆగవా ?

August 19, 2017

దేశం ఎదుగుతోందా ? వైజ్ఞానికంగా, సామాజికంగా, సాంకేతికంగా దేశమే కాదు ప్రపంచం యావత్తు ఎదుగుతోంది. కానీ మనిషే మనిషిగా ఎదగడం లేదు. స్త్రీల విషయంలో పురుషుల దాష్టికాలు ఆగడం లేదు. వారి మీద రోజుకో దాడి ఎక్కడోచోట జరుగుతూనే వుంది. ఎందరో మహిళలు మగాళ్ళ మృగత్వానికి అసువులు భాస్తున్నారు. మగాడు ఆడవాళ్ళను తనతో సమానంగా చూడలేడా ? ఆడది లేకుండా మగాడు ఎదిగిన దాఖలాలే లేవు. కానీ అలాంటిదేమీ లేదనుకునే మేల్ డామినేటింగా వ్యవస్థ ఇది ? మూలాలు తెలుసుకోకుండా పురుషుడు స్త్రీలను ఇంకా ఎంత కాలం వేధిస్తాడు ? నిర్భయ లాంటి ఉదంతాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గుముఖం పట్టట్లేదు. శిక్షలు ఎంత కఠినతరం చేసినా ఎందుకు ఈ దాడులు ఆగటం లేదు ?

రోజూ వార్తల్లో మదమెక్కిన మగాడి చేతిలో ఏ అతివ బలి పశువు అయి ప్రాణాలు పోగొట్టుకుంటుందోననే భయాలు సర్వాత్రా అలుముకున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు మగాడే పెద్ద శతృవు అవుతున్నాడు ఎందుకిలా ? నిన్నటి దురాగతాన్ని మరవక ముందే తాజాగా ఇంకో వార్త. అందులో స్త్రీయే తుదముట్టుకుపోయేది ? తాజాగా మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో ఈ ఘటన దేశాన్ని విస్తుబోయేలా చేస్తోంది. రెగ్యులర్ గా జిమ్ముకొచ్చే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంటిచ్చిందట. అదే ఆమె చేసిన పాపమైంది. అతను చేసింది మాత్రం 100 పర్సెంట్ కరెక్టనుకున్నాడు పునీత్ మాల్వియా అనే ఈ కీచకుడు. వీడియోలో చూడండి వాడెలా సాటి ఆడదాన్ని పట్టుకొని కొడుతున్నాడో. జిమ్ము చేసి కండలు పెంచానన్న పొగరునంతా ఎలా ఒక ఆడదాని మీద చూపిస్తున్నాడో చూడండి.

‘ రేయ్ గాడిదా నువ్వు ఆడదానికే పుట్టావ్ రా అనే విషయాన్ని మర్చిపోయి కొడుతున్నావ్ కదరా.. నీకెలా మనసొప్పుతోందిరా భడ్వీకె ’ అని ఇప్పటికే చాలా మంది నెటిజనులు గుస్సా అవుతున్నారు. నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తావా అని ఆమె మెడ మీద బలంగా గుద్ది, నడుము మీద పెక్కిచ్చి తన్నాడు. తను విచలించకుండా కింద పడిపోయింది. మిగతా జిమ్ము చేస్కుంటున్న వాళ్ళంతా వచ్చి వాణ్ని ఆపారు లేకపోతే అయ్య ఇంకా రెచ్చిపోయేటోడేమో. అయినా అక్కడున్న మగాళ్ళందరు ఒక్క క్షణం ఆమె మా చెల్లె అనుకునుంటే వాణ్ని అక్కడే పట్టుకొని ‘ మా చెల్లెను కొడ్తావారా బద్మాష్ ’ అని పొట్టు పొట్టు తగిలించేదుండె. అప్పుడే అయ్య సాపైతుండె. ఆమె జిమ్ కోచ్ సాయంతోని పోలీస్ స్టేషన్ల కంప్లైంటిచ్చిందట. వాడేమో తోక ముడ్శి పారిపోయిండట. పోలీసోల్లు వూకుండరు కదా ఇంటరాగేషన్ మొదలు పెట్టారంట.

దొరికితే పట్టుకొని నడి రోడ్డు మీద నిలబెట్టి ఆమెతోని వాని ఈపు ఇమానం మోత మోగించాలి. అప్పుడే అయ్యగానికి సిగ్గొస్తుండొచ్చు.