stop-spreading-negativity-about-me-upasana-requested
mictv telugu

నా పిల్లలకు కష్టం విలువ తెలియాలి-ఉపాసన

February 22, 2023

stop-spreading-negativity-about-me-upasana-requested

అందరి పిల్లలూ ఒకలాగే పెరగాలి. మా పిల్లలకు కష్టం విలువ తెలిసేలా పెంచుతాను అంటున్నారు మెగాఫ్యామిలీ కోడలు ఉపాసన. నేను డైమండ్ స్పూన్ తో పుట్టడానికి నా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. ఆ కష్టం విలువ నాకు తెలుసు. మా పిల్లలను కూడా అలాగే పెంచాలని అనుకుంటున్నాం చరణ్, నేను అని చెప్పారు. తన మీద వస్తున్న నెగెటివ్ వార్తలపై సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు ఉపాసన.

సుఖంగ బతకాలని ఎవరు కోరుకోరు. అందరూ డైమండ్, సిల్వర్ స్పూన్లో పుట్టాలనే అనుకుంటారు. అయితే తాను ఎప్పుడూ అవన్నీ కావాలని కోరుకోలేదని తన మనసులో మాటలను చెప్పారు ఉపాసన. నిజానికి నాకు ఉన్న డబ్బులతో ఇంటి దగ్గరే రిలాక్స్ గా కూర్చోవచ్చు. కానీ నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలని అనుకున్నాను. నా పుట్టుకకు కారణం ఉందని నమ్ముతాను. గొప్ప ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉండి కూడా చుట్టూ ఉన్న ప్రజలకు ఏం చేయకపోతే, నా జీవితానికి అర్ధం లేదు అని వ్యాఖ్యానించారు. నా గురించి నెగటివ్ గా మాట్లాడడ్డం మానేస్తే మంచిదని ఉపాసన రిక్వెస్ట్ చేశారు.

ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నారు ఉపాసన. అపోలో హాస్పటల్స్ బాధ్యతలు ఒకవైపు, రామ్ చరణ్ భార్యగా మరొక వైపు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె తన స్పెషాలిటీని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు.