ఈసీపై బురదజల్లడం  మానండి.. రజత్ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

ఈసీపై బురదజల్లడం  మానండి.. రజత్ ఆగ్రహం

April 16, 2019

సోషల్ మీడియాలో ఈసీపై వస్తున్న కల్పిత కథనాల వల్ల ప్రతిఒక్కరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

Stop the untouchability campaign in the EC.. Rajat Kumar is angry

‘కొందరు అదేపనిగా ఈసీపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంల గురించి రకరకాలుగా రాశారు. వాటిని పోలింగ్‌ కోసం వాడలేదు.. కేవలం అవి అవగాహన కోసం వాడిన యంత్రాలు మాత్రమే. పోలింగ్‌ శాతాల గురించి కూడా చాలా కల్పితాలు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోంది ఈసీ. పోలింగ్‌ పూర్తయిన వెంటనే సాయంత్రం 5గంటలకు అంచనా వివరాలు ఇస్తాం. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్‌ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలుగుతాం. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తాం. దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయి. ఫారం 17ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా అనవసర రాద్ధాంతం చేయడం తగదు. ఇలా తప్పుడు ప్రచారం చేసినవారిపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకుంటాం. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పార్టీల ప్రతినిధులు కూడా ఉండొచ్చు. కీసరలో ఈవీఎంలను సీల్‌ చేసేటప్పుడు ఫోన్‌లో ఫొటో తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేశాం. అందరూ ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలి. ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దు’ అని కోరారు.