యూట్యూబ్ నుంచి స్టోరీస్ ఫీచర్ తొలగింపు
ఫేమస్ వీడియో ఫ్లాట్ ఫ్లామ్ యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ ను ఆపేయనుంది. దీన్ని 2017లో పరిచయం చేసింది. దీనికి పెద్దగా వ్యూయర్ షిప్ లేకపోవడంతో దీన్ని తొలగిస్తున్నామని చెప్పింది.
ప్రస్తుతం షార్ట్స్, రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. చిన్నగా, క్రిస్ప్ గా ఉండే వాటినే జనాలు చూస్తున్నారు. అందుకే యూట్యూబ్ షార్ట్స్, కమ్యునిటీ పోస్ట్, లైవ్ వీడియోలు లాంటి ఇతర ఫీచర్ల మీద దృష్టి పెట్టాలని భావిస్తోంది. అందుకే స్టోరీస్ ఫీచర్ ను ఆపేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఈజీ అప్ డేట్ షేరింగ్, సంభాషణల ప్రారంభం, కంటెంట్ ప్రచారం లాంటి వాటికి బదులుగా కమ్యూనిటీ పోస్ట్ లను యూట్యూబ్ ప్రోత్సాహించాలని అనుకుంటోంది. దీనికోసం షార్ట్స్, లైవ్ వీడియోలు బెస్ట్ అని అనుకుంటోంది.
యూట్యూబ్ షార్ట్స్, కమ్యునిటీ పోస్ట్, లైవ్ వీడియోలకు ఎక్కువ వ్యూయర్ షిప్ తో పాటూ కామెంట్లు, లైకులు వస్తున్నాయి. వీటికే యూజర్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. జూన్ 6 నుంచి యూట్యూబ్ స్టోరీస్ అందుబాటులో ఉండదు. అంతకు ముందు ప్రసారం అయిన స్టోరీస్ పోస్ట్ చేసిన ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయి అని కంపెనీ తెలిపింది. ఇదే స్టోరీస్ ఫీచర్ ఇన్స్టా, ఫేస్ బుక్ లలో కూడా సక్సెస్ కాలేదు. ఇక్కడ కూడా మొదట్లో బాగానే యూజర్లు ఉన్నా… తరువాత బాగా తగ్గిపోయారని యూట్యూబ్ యాజమాన్యం చెబుతోంది. అందుకే ఇప్పడు దాన్ని తొలగిస్తున్నామని అంటోంది.