కులంలేదు మతం లేదు.. ప్రేమా జిందాబాద్(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కులంలేదు మతం లేదు.. ప్రేమా జిందాబాద్(వీడియో)

October 11, 2020

vbnvgn

‘పెద్దవాళ్లం మేము చూసిన సంబంధం అయితేనే పిల్లలు సుఖ పడతారు. ఆనందంగా జీవిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అవేవి ఉండవు. పైగా కలం కానివారిని పెళ్లి చేసుకుంటే మా పరువు ఏం కాను?’ ఇలా కొందరి మైండ్ సెట్ అయి ఉంది. ఈ కారణంగా ప్రేమికుల మీద అనాదిగా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమికులను పాపాత్ములుగా చిత్రీకరించి అన్యాయంగా చంపేస్తున్నారు. మిర్యాలగూడ ప్రణయ్, అమృత, హైదరాబాద్ హేమంత్, అవంతికలు.., ఇలా ఎందరో పరువు అన్న పదానికి వారి జీవితాలు సర్వనాశనం అయ్యాయి. ఒక్కసారి కళ్లను కమ్మిన ఆ కులం బైర్లను తొలగించుకుని చూస్తే అంతా బాగానే ఉంటుంది. ఆ బైర్లను తొలగించే క్రమంలో మైక్ టీవీ ఓ చిన్న ప్రయత్నం చేసింది. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల అనుభవాలను మీ ముందు ఉంచింది. 

వారి ప్రేమను కూడా తొలుత పెద్దవాళ్లు నిరాకరించారు. తర్వాత వాళ్లు బాగుండటం చూసి నిరాకరించిన వారంతా దగ్గరయ్యారని వారి అనుభవాలను పంచుకున్నారు. పెద్దలు చూసి అన్నీ రకాలుగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్న జంటల్లో ఎంతమంది సుఖంగా, సంతోషంగా ఉన్నారు? అలాంటి కాపురాలు ఎన్ని కొల్లేరులు అవలేదు? పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లన్నీ హ్యాప్పీ ఎండింగ్ అయ్యాయా? పెళ్లయ్యాక ఎన్ని వరకట్న వేధింపులను చూడటంలేదు? అత్తింటి ఆరళ్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అలాంటివి జరిగినప్పుడు నా కూతిరి తలరాత బాగుందని బాధపడి సర్దుకుపోతున్న తల్లిదండ్రలు ఎందరో. అప్పుడు కూడా వారు కేవలం పరువు అన్న ఒక బౌండరీలో జీవితాలను శాసించుకుంటున్నారు. ప్రేమించడం తప్పు కానేకాదు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు అని చెప్పడమే ఈ వీడియో ఉద్యేశం. కింది లింకులో మీరు వారి అనుభవాలు వింటే తప్పకుండా ప్రేమా జిందాబాద్ అంటారు.