వింత శిశువు.. బతుకుతాడా లేదా అని టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

వింత శిశువు.. బతుకుతాడా లేదా అని టెన్షన్

March 31, 2022

 

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాట్లాం జిల్లా జావ్రా గ్రామానికి చెందిన షహీన్ అనే మహిళ ఓ వింత శిశువుకు జన్మించింది.అయితే, పుట్టిన ఆ బిడ్డకు రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. తీరా పుట్టిన బిడ్డను చూసిన వైద్యులు షాక్‌య్యారు.

డాక్టర్లు మాట్లాడుతూ..”డెలివరీకి ముందు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో మహిళ కడుపులో కవలలు ఉన్నట్లు గుర్తించాం. కానీ, తీరా ప్రసవం అయ్యాక ఒకే శిశువుకు రెండు తలలు ఉన్నాయి. అంతేకాకుండా రెండు చేతులు సాధారణంగానే ఉన్నాయి. మూడో చెయ్యి రెండు తలల మధ్య నుంచి ఉంది. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని పాలీసెఫాలీ కండీషన్ అంటాం. అతికొద్ది మంది చిన్నారుల్లోనే ఇలా అత్యంత అరుదుగా జరుగుతుంది” అని డాక్టర్లు వివరించారు. ప్రస్తుతం ఈ చిన్నారిని ఇందోర్​ ఎంవై ఆస్పత్రి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

మరోపక్క శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఎస్ఎన్‌సీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ నవీద్ ఖురేషీ తెలిపారు. ఇలాంటి కేసుల్లో శిశువు గర్భంలోనే మరణిస్తుందని, లేదంటే పుట్టిన 48 గంటల్లోనైనా ప్రాణాలు కోల్పోవచ్చని చెప్పారు. సర్జరీ చేసే అవకాశం ఉన్నా, 60-70 శాతం మంది చిన్నారులు బతకడం లేదని డాక్టర్ నవీద్ తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పుట్టిన తమ బిడ్డ బతుకుతాడా లేదా అని టెన్షన్ పడుతున్నారు..