వింతజీవుల గుట్టు తెలిసిపోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

వింతజీవుల గుట్టు తెలిసిపోయింది..

November 22, 2017

విశాఖపట్నంలో కలకలం సృష్టించిన వింత జంతువుల గుట్టు తెలిసిపోయింది. అవి గ్రహాంతరవాసులని, మనుషులను తింటాయని వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అవి జంతవులు కావని, గుడ్లగూబ జాతికి చెందిన జీలుగు పక్షులను అధికారులు నిర్ధారించారు. వీటిని ఆంగ్లంలో బార్న్ బౌల్ అని అంటారట. ఈ పక్షులను ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాలలో అప్పగించారు.నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఇవి దొరకడం తెలిసిందే.  అయితే వీటిని తమకు అప్పగించకుండా వాటి మానాన వాటిని వదిలేసి ఉంటే అవి తల్లితోపాటు పోయేవని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ‘వీటి సాంకేతిక నామం టైటో ఆల్బా. తెలుగులో జీలుగు పక్షి అంటారు. పుట్టిన కొద్ది రోజుల వరకూ వాటి శరీరంపై వెంట్రుకలు రావు. దీంతో అవి ఇది వింతజీవుల్లా కనిపిస్తాయి.. ఈ పక్షులు ఎలుకలను, పంది కొక్కులను తిని రైతుకు మేలు చేకూరుస్తాయి’ అని చెప్పారు.