పందికొక్కు కనిపించడం లేదని ఫిర్యాదు.. వాళ్లపైనే అనుమానం.. - MicTv.in - Telugu News
mictv telugu

పందికొక్కు కనిపించడం లేదని ఫిర్యాదు.. వాళ్లపైనే అనుమానం..

October 3, 2022

ఫలానా మనిషి కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు రావడం మామూలే. తమ కుక్క కనిపించడం లేని, తమ పిల్లి, తమ చిలుక కనిపించడం లేదనే ఫిర్యాదులూ వస్తుంటాచాయి. కానీ ఓ వ్యక్తి తన పందికొక్కు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. విదేశాల్లో ఎలుకలను, పాములను, కప్పలను పెంచుకోవడం మామూలే కనక ఇందులో పెద్ద వింతేం లేదని తీసిపారెయ్యకండి. ఈ విచిత్రమైన ఫిర్యాదు మన దేశంలోనే నమోదైంది.

రాజస్తాన్‌లోని బస్నవడ జిల్లా సజ్జన్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ మహత్తరమైన ఫిర్యాదు చేశాడు. తను పెంచుకుంటున్న పందికొక్కు గత నెల 28 తేదీ నుంచి కనిపించడంలేదని, వెంటనే వెతికి పెట్టాలని పోలీసులను వేడుకున్నారు. నల్లగా, లావుగా ఉంటుందని, బరువు 700 గ్రాములని పూర్తి వివరాలు కూడా చెప్పాడు. అంతేకాకుండా, తన అన్న కొడుకులే దాన్ని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానంగా ఉందన్నాడు. అతనికి పిచ్చిపట్టిందేమో అనుకుని పోలీసులు ఇంటికెళ్లమ్మా అని చెప్పారు. అతడు వినకుండా కేసు పెట్టల్సిందేనని గొడవ పడ్డాడు. పోలీసులు నిందితులని పిలిపించి దర్యాప్తు జరుపుతున్నారు.