కవల యువతుల వింత కోరిక.. ఒకేసారి జరగాలంటూ పట్టు - MicTv.in - Telugu News
mictv telugu

కవల యువతుల వింత కోరిక.. ఒకేసారి జరగాలంటూ పట్టు

April 25, 2022

ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన కవల యువతులు అన్నా, లూసీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారారు. అందుకు కారణాలు ఒకటి కాదు చాలా ఉన్నాయి. వివరాలు.. దాదాపు చూడ్డానికి ఒకేలా ఉన్న ఈ అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని ప్రేమించారు. 2012లో బెన్ బైర్నే అనే యువకుడితో డేటింగులో ఉన్నామంటూ ప్రకటించారు. అనంతరం రెండేళ్ల తర్వాత 2014లో మరో వింత ప్రకటన చేశారు. తామిద్దరం ఒకే వ్యక్తితో, ఒకేసారి గర్భం దాల్చి, ఒకే సమయంలో పిల్లల్ని కనాలనుకుంటున్నట్టు తెలిపారు. అయితే ఆస్ట్రేలియాలో ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరిని వివాహం చేసుకోవడం కుదరదు.

అదలా ఉంచితే.. ఒకే సారి వివాహం సాధ్యమవుతుంది కానీ, ఒకేసారి గర్భం, ఒకేసారి డెలివరీ అనేది కుదురుతుందా అనేది ప్రశ్న. అయితే ఇందుకు వారు ఓ పరిష్కారాన్ని వెతుక్కొన్నారు. బెన్ ద్వారా ఐవీఎఫ్ పద్దతిలో గర్భం దాల్చాలని అనుకుంటున్నారు. ఇంతలా ఒకేసారి అనే పట్టుదల ఎందుకని అడిగితే వారు ఇలా సమాధానమిస్తున్నారు. ఇద్దరూ ఉదయం ఒకేసారి నిద్రలేస్తారు. ఒకేసారి పళ్లు తోముకొని కలిసే స్నానం చేస్తారు. కలిసే తింటారు, కలిసే పడుకుంటారు. ఇద్దరికీ ఒకే సమయంలో ఆకలి వేస్తుందంట. అందుకని, గర్భం, ప్రసవం కూడా ఒకే సమయంలో జరగాలని వీరి వాదన. అయితే వీరి కోరిక ఇప్పటివరకు నెరవేరలేదు. ఇటీవలే ఇద్దరూ కలిసి ప్రెగ్నెన్సీ టెస్టు చేయిస్తే నెగిటివ్ వచ్చిందంట. అయితే తన కంటే ముందు అన్నా గర్భం దాలుస్తుందేమోనని లూసీ భయపడుతుందంట. ఇదిలా ఉంటే ఇద్దరినీ ఒకేసారి వివాహం చేసుకునేందుకు అనుమతించే దేశానికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెన్ భావిస్తున్నాడంట. చూద్దాం మరి వీరి కల నెరవేరుతుందో లేదో.