విచిత్ర ఘటన.. కుక్క పిల్లకు సీమంతం చేసిన దంపతులు - MicTv.in - Telugu News
mictv telugu

విచిత్ర ఘటన.. కుక్క పిల్లకు సీమంతం చేసిన దంపతులు

March 18, 2022

fbfbf

ఓ దంప‌తులు ఎంతో ఇష్టంగా కుక్కలను పెంచుకున్నారు. అంతేకాకుండా ఆ కుక్కలను తమ కుటుంబంలోని ఓ సభ్యులుగా చూసుకుంటున్నారు. అయితే, అందులో ఓ కుక్క గర్భం దాల్చడంతో బంధువులను, ఊరివారిని పిలిచి సీమంతం చేశారు. ఈ విచిత్ర సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని సేలం జిల్లా మెచ్చేరికి చెందిన స్టూడియో యజమాని మురుగన్‌, సుశీల దంపతుల కుమార్తె హేమరాణి.. రెండు కుక్క‌ల‌ను తీసుకొచ్చి, పెంచుకుంటోంది. ఆ కుక్కల‌ను మురుగన్‌, సుశీల దంపతులు త‌మ సొంతింటి వ్య‌క్తులుగా చూసుకుంటున్నారు.

ఈ క్రమంలో పొమేరియన్‌ రకానికి చెందిన హైతి అనే మగ శునకాన్ని, సారా అనే ఆడ కుక్క‌కు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. తాజాగా సారా గర్భం దాల్చడంతో సీమంతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకోసం ఆహ్వాన పత్రికలను ముద్రించి, త‌మ‌ బంధు మిత్రులను ఆహ్వానించారు. ఆ కుక్క‌ సీమంతానికి మహిళలను పిలిచి, వారికి మిఠాయిలు, జాకెట్ బ‌ట్ట‌, గాజులు, తాంబూలం వంటివి స‌మ‌ర్పించుకున్నారు. అయితే ఆ సీమంతానికి వచ్చిన వారంతా ఆ వేడుకను చూసి సంతోషంచి, ఆ కుక్క‌ను ఆశీర్వదించారు.