ఐర్లాండ్ దేశంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి, గజినీలాగా మారిపోతున్నాడని, ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయిస్తే, అంతా నార్మల్‌గానే ఉంది కానీ ఈ వ్యాధి పేరు ఏమిటో అర్థంకావటం లేదని డాక్టర్లు అయోమయానికి గురైనట్లు.. ప్రముఖ ఐరిష్ మెడికల్ జర్నల్ సంచికలో ఓ వ్యాసకర్త పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ”ఓ 66 ఏళ్ల వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే అన్నీ మార్చిపోయి, భార్యనే ఎవరు నువ్వు అంటూ ప్రశ్నిస్తున్నాడు. పోనీ, అతనికి జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందా అంటే పేరు, వయసు పాత విషయాలన్నీ మాత్రం కరెక్ట్‌గా చెబుతున్నాడు. ఇక, లాభం లేదని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయిస్తే, మతిమరుపు, నరాల సమస్యవంటివి లేవని, అంతా మామూలుగానే ఉందని వైద్యులు అన్నారు. కానీ, ఈ తాత్కాలిక వ్యాధి మరుపేమిటో అసలు అర్థంకావటం లేదని వారు అయోమయానికి గురయ్యారు.” అని వ్యాసకర్త వివరించారు.
ఈ వ్యాధికి ప్రధాన కారణం.. ‘‘సాధారణంగా స్ట్రోక్ తదితరాల వల్ల తలెత్తే నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ)గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కు కారణమవుతుంది. కానీ, అలాంటివేవీ లేకుండానే కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కేసు అలాంటిదే. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఇలా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక, ఈ వ్యాధి పట్ల పలువురు వైద్యులు స్పందిస్తూ..” శారీరకంగా బాగా శ్రమ పడ్డా, అతి చల్లని, లేదా బాగా వేడి నీళ్లలో చాలాసేపు మునిగినా, ఎమోషనల్ స్ట్రెస్‌కు, బాధకు గురైనా, అరుదుగా కొన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాక, ఇలా స్వల్పకాలిక మతిమరుపు వచ్చిపడుతుంది. ఫలితంగా తాజా సంఘటనలు ఎవరో చెరిపేసినట్టుగా జ్ఞాపకాల్లోంచి మాయమైపోతాయి. కొందరేమో ఏడాది క్రితం జరిగినవి మర్చిపోతుంటారు. చాలామటుకు కొద్ది గంటల్లోనే ఆ జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చి మళ్లీ మామూలైపోతారు.”