వింత వివాహం: 500 మందితో శునకాలకు పెళ్లి.. ఆ తర్వాత - MicTv.in - Telugu News
mictv telugu

వింత వివాహం: 500 మందితో శునకాలకు పెళ్లి.. ఆ తర్వాత

June 7, 2022

ఉత్తర ప్రదేశ్‌లోని ఓ వింత విహవాం జరిగింది. ఇద్దరు సాధువులు కలిసి చేసిన ఈ వింత వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. హమీర్పూర్ జిల్లా సుమెర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భరువగా గ్రామంలో వింత వివాహం జరిగింది. ఇద్దరు సాధువులు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న శునకాలకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసి, ఆ తర్వాత ఆటపాటలతో జనాల మధ్య భారీగా ఊరేగింపు చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Hindustan Times (@hindustantimes)

‘ఉత్తరప్రదేశ్‌లోని సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివాలయం ఉంది. ఆ గుడిలో ప్రధాన పూజారి అయిన స్వామి ద్వారాక దాస్ మహారాజ్‌ ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి పెళ్లి చేయాలని భావించిన ఆయన పరచాచ్‌లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్‌ పెంచుకుంటున్న శునకంతో వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ నెల 5న ముహూర్తం ఫిక్స్ చేశారు. వివాహానికి ఆయన శిష్యులను, భక్తులను ఆహ్వానించారు. శునకాలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. భూరి, కల్లూ అనే ఈ శునకాల పెళ్లికి హాజరైన వారికి పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. వివాహం అనంతరం 500 మందితో శునకాలకు బరాత్ కూడా నిర్వహించారు.”

మరోపక్క శునకాల పెళ్లికి హాజరైన వారు ఈ వింత పెళ్లికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ, ఈ వివాహం ఎందుకు చేశారు? అనే కచ్చితమైన కారణం మాత్రం తెలియలేదు. విశేషం ఏమిటంటే వైరల్ అవుతున్న వీడియోలో వధువు ‘భూరి’ మెడలో మంగళసూత్రం కూడా కనిపించడం నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.