వీడియో : చనిపోయినట్టు నటించే వింత పాము - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : చనిపోయినట్టు నటించే వింత పాము

May 26, 2022

ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశుల్లో నటన అనే విద్య కేవలం మనుషులకు మాత్రమే సాధ్యమవుతుంది. మరే జీవికీ ఈ కళ రావడం సాధ్యం కాదు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాము మాత్రం నటనలో నటీనటులనే మరిపించేస్తోంది. సాధారణంగా ఎక్కడైనా పాములు మనం వాటి జోలికి వెళ్లకుంటే వాటి మానాన అవి బతుకుతాయి. మన వల్ల ఏదైనా కీడు వస్తుందని తెలిస్తేనే కాటు వేస్తాయి. కానీ, వీడియోలో ఉన్న పాము వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. మనిషి చేయి పడగానే చనిపోయినట్టు నటిస్తోంది. అంతేకాక, నాలుక బయటికి చాపి చూసేవాళ్లు నిజంగా చనిపోయిందనుకునేలా భ్రమింపజేస్తోంది. దీన్ని చూసిన వాళ్లంతా అవాక్కవుతున్నారు. ఏంటి పామేనా ఇలా చేస్తోంది అంటూ నోరెళ్లబెడుతున్నారు. దీన్ని గనుక మన సినిమా వాళ్లు చూస్తే పాముల సీన్స్ అన్నీ గ్రాఫిక్స్ అవసరం లేకుండా చేసేయవచ్చు. అయితే ఈ పాము పేరు, ఎక్కడుంటుందీ అన్న వివరాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు.

https://m.facebook.com/groups/328153400981693/permalink/1455251351605220/?sfnsn=wiwspwa&ref=share