ఈ కాలంలో, ఈ యుగంలో ప్రతిదీ ఒక క్లిక్ తో మన ముందుకు వచ్చేస్తుంది. అలా అని దేంట్లో ఏది వెతకాలో తెలియకపోతే ఎలా? ఇన్ స్టా మార్ట్ లో మరీ విచిత్రంగా వెతికారు. ఆ లిస్ట్ పై ఓ లుక్కేయండి..
సూపర్ మార్కెట్లు తమ తమ యాప్ లను తీసుకొచ్చాయి. రోజువారీ సరుకుల కోసం ఒక క్లిక్ చేస్తే చాలు. అలానే కొన్ని యాప్స్.. జెప్టోలాంటి ఇతర యాప్స్ కూడా నిత్యావసర సరుకుల కోసం వచ్చాయి. స్విగ్గీ కూడా ఇన్ స్టా మార్ట్ అంటూ నిత్యావసర సరుకుల కోసం ఒక యాప్ తీసుకొచ్చింది. అటు ఫుడ్ డెలివరీ యాప్, ఇటు నిత్యావసరాల కోసం యాప్ అన్నమాట.
ఇన్ స్టంట్ డెలివరీ యాప్ నుంచి ఎవరైనా ఏం తెప్పిస్తారు? ఇంట్లో వాడుకునే సరుకులు అని అందరికీ తెలుసు. కానీ చాలామంది వేరేవి కూడా ఉంటాయేమోనని వెతికినట్టున్నారు. ఈ విషయం స్విగ్గీ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియచేసింది. ఈ జాబితా చాలా వింతగా ఉంది.
ఫోన్ తో ఏదైనా శోధించవచ్చు, ఆర్డర్ చేయవచ్చు. వెంటనే మన చేతిల్లోకి తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇన్ స్టా మార్ట్ ని ఉపయోగించినట్లయితే ఇది స్థానికి డెలివరీ మార్కెట్ ప్లేస్ అని మీకు తెలుస్తుంది. అంటే కిరాణా.. ఇతర రోజువారీ అవసరమైన వస్తువుల కోసం వాడుతారు. ఆర్డర్ చేసిన నిమిషాల్లో మీకు చేరుతుంది. ఇందులో చివర నుంచి మొదట సెర్చ్ పదం పెట్రోల్. అవును.. దీన్ని 5,981సార్లు వెతికారు. మిగతా ఆర్డర్ కింద నుంచి పైకి అన్నట్లు చదువుకోగలరు. అండర్ వేర్ 8, 810 సార్లు, మమ్మీ 7, 275సార్లు, సోఫా 20, 653సార్లు, బెడ్ 23, 432 సార్లు వెతికారు.