విచిత్ర పెళ్లి: తనను తానే పెళ్లి చేసుకుంటుంది - MicTv.in - Telugu News
mictv telugu

విచిత్ర పెళ్లి: తనను తానే పెళ్లి చేసుకుంటుంది

June 2, 2022


గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి విచిత్రంగా ఆమెను ఆమె పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన ప్రతివారు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇదేం పెళ్లి? పెళ్లి అంటే వరుడు, వధువు చేసుకుంటారు కదా? ఆమెను ఆమె ఎలా పెళ్లి చేసుకుంటుంది? అనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు గోత్రిలోని ఆలయంలో వివాహం చేసుకున్న తర్వాత, హనీమూన్ కోసం గోవా వెళ్లాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..గుజరాత్‌ రాష్ట్రం వదోదర ప్రాంతంలో నివాసముంటున్న 24 ఏళ్ల క్షమాబిందు పెళ్లి చేసుకుంటోంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా? ఉందండి. ఆమె తనకు నచ్చినవాడినో లేదా పెద్దలు చూసిన వ్యక్తినో పెళ్లి చేసుకోటం లేదు. తనను తానే పెళ్లాడుతోంది. ముహూర్తం తేదీ జూన్ 11న అంటూ పెళ్లి పత్రికను కూడా ప్రింట్ చేయించింది.

క్షమాబిందు మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. కానీ, వధువుగా మారాలని అనుకుంటున్నాను. అందుకే స్వీయ వివాహం చేసుకుంటున్నా. నేను దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో కూడా శోధించాను. దేశంలో ఏ మహిళ అయినా తనను తానే పెళ్లి చేసుకుందా? అని పరిశీలించాను. కానీ, ఎవరూ లేరని తెలిసింది. కనుక దేశంలో నాకు నేనే ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి వ్యక్తిని నేనే. నా దృష్టిలో స్వీయ వివాహం అంటే నీ పట్ల నువ్వు అంకిత భావం కలిగి ఉండడం. ఎటువంటి షరతుల్లేని ప్రేమకు నిదర్శనం. నాకు నేను స్వీకరించడం. ప్రజలు మేము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. నన్ను నేనే ప్రేమించాను’’ అందుకే ఈ పెళ్లి అని ఆమె అన్నారు.