దుండగుల దౌర్జన్యం.. కానిస్టేబుల్‌పై దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

దుండగుల దౌర్జన్యం.. కానిస్టేబుల్‌పై దాడి 

April 5, 2020

Strangers beating police constable in Chandrayangutta -

లాక్‌డౌన్ వేళ నిరంతరంగా శ్రమిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి జరగడం కలకలం రేపుతోంది. రేయింబవళ్లు ప్రజల శ్రేయస్సు కోసం వారు తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి వృత్తికే అంకితం అయ్యారు. అలాంటివారిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్ వద్ద చోటు చేసుకుంది. బాబానగర్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రవీణ్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కానిస్టేబుల్‌ను ఢీకొట్టారు. ప్రవీణ్ కిందపడగానే విచక్షణారహితంగా దుండగులు కర్రలతో దాడి చేశారు. అనంతరం రాళ్లు రువ్వారు. దీంతో ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. తలకు గాయం బలంగా కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ను వెంటనే డీఆర్డీఎల్ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మజీద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్‌ను పరామర్శించారు. 

కాగా, ఇది ఆకతాయిల పనే అని అనుమానిస్తున్నారు. రోడ్లపై తిరిగారని లాఠీఛార్జ్ చేసినందుకు ఆగ్రహించిన ఆకతాయిలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందుతులను పట్టుకుంటామని ఏపీపీ తెలిపారు.