Strategies for voters, not just for Parties
mictv telugu

పార్టీలకే కాదు ఓటర్లకు స్ట్రాటజీలు..అంతు చిక్కని ఓటర్ నాడి

October 20, 2022

Strategies for voters, not just for Parties

మునుగోడులో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. నేతలు ఇళ్లను చుట్టేస్తున్నారు. సభలు,సమావేశాలతో జనాల్లోకి వెళ్తున్నారు. అడిగిన హామీలు తీరుస్తామంటున్నారు. పనులు చేసి పెడతామంటున్నారు. మీకు ఏం కావాలో చెప్పండి మీకు మేం ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఓటర్లు మాత్రం రాజకీయ రామయణంలా వింటున్నారు. షిఫ్టుల వారీలగా ఏ పార్టీ నేతలు వచ్చినా కలుస్తున్నారు. వాళ్లు చెప్పింది ఒపిగ్గా వింటున్నారు. కమిట్ మాత్రం కావడం లేదు.ఎవరికి మాట ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు కమిట్ అయితే ముందు ముందు సర్‌ప్రైజింగ్‌గిఫ్ట్‌లు మిస్ అవుతామనే ఆలోచనలో కొందరు ఉన్నారు. చివరిదాకా చూసి డిసైడ్ అవుదామనుకుంటున్నారు ఇంకొందరు.

అంతుచిక్కని మునుగోడు ఓటర్ నాడి

బై ఎలక్షన్స్‌లో ఓటర్ నాడి ఇట్టే తెలిసిపోతుంది. టఫ్ ఫైటా.. ఎవరికి ఎడ్జ్ ఉంది.. గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా జనం మాటల్ని బట్టి అంచనాకు రావొచ్చు. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇలాగే పల్స్ తెలిసిపోయాయి. మునుగోడు ఓటర్ మాత్రం పార్టీలకు మించిన స్ట్రాటజీలతో ఓపెన్ కావడం లేదు. ఎవరొచ్చినా ఏం చెప్పినా వింటున్నారు. ఓటు‌పై మాట మాత్రమైనా కమిట్ అవడం లేదు. లాస్ట్ మినిట్ దాకా వేచి చూద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఊరూరు తిరుగుతున్న నేతలకు ఓటర్ల తీరు అర్థం కావడం లేదు. అందరితో మాట్లాడుతున్నా ఏ ఒక్కరూ ఓపెన్ కావడం లేదు. ఓటర్ నాడి తెలిస్తే ఎక్కడ వీక్ ఉన్నారో తెలుసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు.

పార్టీలే ఆదర్శమంటున్న ఓటర్లు

మునుగోడులో రోజురోజుకు,పూటపూటకు సీన్ మారుతోంది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. ఉదయం ఓ పార్టీలో చేరితే సాయంత్రానికి మరో పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. వార్డు మెంబర్ల నుంచి ఎంపీపీలదాకా ఇదే పరిస్థితి. మునుగోడులో పార్టీలు చోటామోటా లీడర్లపైనే నజర్ పెట్టాయి. వీలైనంతమంది నాయకుల్ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అడిగినంత ఇచ్చేస్తున్నారు. లక్ష నుంచి కోటి రూపాయల దాకా వారి వెయిటేజీని లెక్కలేసి ఇస్తున్నారని మునుగోడులో ప్రచారం జరుగుతోంది. అందుకే నాయకులు ఉదయం ఓ పార్టీలో సాయంత్రం మరో పార్టీలో కనిపిస్తున్నారని టాక్.

సర్వే సంస్థలకూ చిక్కని నాడి

నేతలకే కాదు సర్వే సంస్థలకు మునుగోడు వాసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్ ఓపెన్ కావడం లేదట. వేయాల్సిన వాళ్లకే ఓటు వేస్తాం…అయినా టైమ్ ఉంది కదా అని సమాధానం ఇస్తున్నారట. ఇంకా కొందరు అడుగు ముందుకేసి మీరు ఏ పార్టీ గెలుస్తుందో చెప్పమనండి ఆ పార్టీ పేరే చెబుతామంటూ షాకిస్తున్నారట. బైట్ల కోసం మైకులు పెడితే…కావాల్సినంత ఇస్తే…మీరు ఏ పార్టీ పేరు ఆ పార్టీకే ఓటు వేస్తామని చెబుతున్నారట.

ఏ ఊరు చూసినా ఇంతే

మునుగోడు నియోజకవర్గంలోని ఓ ఊరు చూసినా ఇదే పరిస్థితి. కుల సంఘాలు, మహిళా సంఘాలతో నేతలు సమావేశమవుతున్నారు. నేతల ముందు డిమాండ్లు ఉంచుతున్నారు. వాటిని తిరుస్తామని నేతలు హామీ ఇచ్చినా కమిట్ మెంట్ మాత్రం ఇవ్వడం లేదు. మూడు పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. కావాల్సింది అడుగుతున్నారు. తీర్చాల్సిన డిమాండ్లని వారి ముందుంచుతున్నారు. మాట ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అన్నింటికీ మౌనమే సమాధానమంటున్నారు.

చివరి దాకా పార్టీలకు టెన్షన్

మునుగోడులో లాస్ట్ డే లాస్ట్ మినిట్ వరకు పార్టీలకు టెన్షన్ తప్పేలా లేదు. తాము ఇచ్చిన హామీలు,చేసిన ఖర్చులు, పంచుతున్న నోట్లు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. మునుగోడు వార్ లో అన్ని పార్టీలది ఇది పరిస్థితి. హుజూరాబాద్ , దుబ్బాకలా ఇక్కడ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తానికి పార్టీలు మీరే కాదు..మేం మారుస్తామంటూ…ప్రతి ఓటర్‌కూ టైమ్ వస్తుందంటున్నారు మునుగోడు వాసులు.