రూటు మార్చిన ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు తమిళనాట ఫోకస్ - MicTv.in - Telugu News
mictv telugu

రూటు మార్చిన ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు తమిళనాట ఫోకస్

February 3, 2020

mnjbjhk

ఆయన నాడి పట్టుకుంటే చాలు ఎన్నికల్లో గెలుపు సుసాధ్యం చేస్తాడు. వరుస సక్సెస్ రేటుతో తన రాజకీయ చతురతను కనబరుస్తున్న వ్యక్తి ప్రశాంత్ కిశోర్. దేశ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు బ్రాండ్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాధించుకున్నారు. ఆయన ‘ఐప్యాక్’ సంస్థతో వివిధ రాష్ట్రాల్లో సీఎంలను చేసిన ఘనత సాధించుకున్నారు. ఇటీవల జగన్‌ను సీఎం చేసిన ఆయన ఇప్పుడు కేజ్రీవాల్ కోసం పని చేస్తున్నారు. ఇక ఆ వెంటనే తమిళనాట ఫోకస్ పెట్టనున్నారు. 

డీఎంకే పార్టీ తరుపున ప్రశాంత్ కిశోర్, ఐఫ్యాక్ పని చేయనున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన వ్యూహం రచించనున్నారు. ఈ విషయాన్ని డీఎంకే చీఫ్  ఎంకే స్టాలిన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఐప్యాక్‌ సంస్థ తమకు సేవలందిస్తుందని తెలిపారు. డీఎంకే గెలుపు కోసం కృషి చేస్తుందని ఐప్యాక్ సంస్థ కూడా పేర్కొంది. కాగా 2014 లో ప్రధాని నరేంద్ర మోదీ, 2015 లో నితీష్ కుమార్, 2017 లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, 2019లో ఏపీ సీఎం జగన్ కోసం పని చేశారు. అయితే తొలిసారి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వ్యూహం బెడిసి కొట్టింది.