stray dogs issue people feed them could be held liable says Supreme Court
mictv telugu

వీధికుక్కలు కరిస్తే జాలిగుండెలదే బాధ్యత.. సుప్రీం కోర్టు

September 10, 2022

 stray dogs issue people feed them could be held liable says Supreme Court

వీధికుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు వీధి కుక్కల సమస్యను పరిష్కరించలేక చేతులెత్తేయడంతో కోర్టు కొత్త అస్త్రం సంధించింది. ‘‘వీధి కుక్కలు ఎవరినైనా కరిస్తే ఇకపై వాటికి జాలితో ఆహారం అందించే వారే బాధ్యత వహించాలి’’ అని స్పష్టం చేసింది. కేరళలో వీధికుక్కల సమస్యపై దాఖలైన కేసును సుప్రీం కోర్టు శనివారం విచారించింది.

‘‘వీధి కుక్కలు ఎవరినైనా కరిస్తే వాటికి తిండి పెట్టే వారే బాధ్యత వహించాలి. బాధితులకు జరిగే నష్టాన్నీ వారే భరించాలి. బాధితులకు టీకా వారే వేయించాలి. వీధికుక్కలను జాలితో కాపాడేవారు వాటికి ప్రత్యేక నంబర్లో, గుర్తులో వేయాలి. ఆ మూగజీవాలు తిండి దొరకనప్పుడు, జబ్బు సోకినప్పుడు దాడి చేస్తుంటాయి. రేబిస్ బారిన పడుతుంటాయి. వాటి సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. వీలైతే ప్రత్యేక చట్టం తీసుకురావాలి. వీధికుక్కల సంరక్షణ ఎంత ముఖ్యమో, అవి ప్రజలను కరవకుండా చూడటమూ అంతే ముఖ్యం’ అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో, వీధికుక్కలకు సకాలంలో ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వం హామీ ఇచ్చింది.