పులిని కొరికి చంపిన వీధికుక్కలు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పులిని కొరికి చంపిన వీధికుక్కలు (వీడియో)

June 13, 2019

‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ పద్యం తెలుసుకదా. అలాంటి సంఘటనే కేరళలో జరిగింది. చూడగానే వణుకు పుట్టించే చిరుతపులిని పదికిపైగా వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేసి చంపేశాయి. పులి ఎదురు తిరిగినా ఫలితం లేకపోయింది. దాన్ని కుక్కలు భీకరంగా కొరికి చంపేశాయి.

కేరళలోని కాల్పెట్టాలోకి ఇటీవల ఓ పులి అడవిలోంచి వచ్చింది. దాన్ని చూసి కుక్కలు తెగ రెచ్చిపోయాయి. మొరుగుతూ దాని వెంట పడ్డాయి. అన్నీకలసి భయంకరంగా పీకేశాయి. చిరుతపులి ప్రతిఘటించే శక్తి లేకుండా కుప్పకూలిపోయింది. కానీ కుక్కులు అప్పటికీ దాన్ని వదలకుండా ప్రాణం పోయేంతవరకు దాడి చేశాయి. ఓ స్థానికుడు ఈ దృశ్యాన్ని ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు.